Kangana Ranaut: వాళ్లు చిల్లర వ్యక్తులు అంటున్న కంగనా రనౌత్!

బాలీవుడ్ ఇండస్ట్రీలో ఫైర్ బ్రాండ్ గా గుర్తింపును సొంతం చేసుకున్న హీరోయిన్లలో కంగనా రనౌత్ ఒకరనే సంగతి తెలిసిందే. ఎన్నో విషయాల గురించి బోల్డ్ గా స్పందించే కంగనా రనౌత్ తను చేసిన కామెంట్ల ద్వారా పలు సందర్భాల్లో వివాదాల్లో చిక్కుకున్నారనే సంగతి తెలిసిందే. కంగనా రనౌత్ నటించిన ధాకడ్ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచిందనే విషయం తెలిసిందే. ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాలేదు.

85 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కగా ఫుల్ రన్ లో ఈ సినిమా సాధించిన కలెక్షన్లు కేవలం 3.77 కోట్ల రూపాయలు కావడం గమనార్హం. అయితే ధాకడ్ సినిమా డిజాస్టర్ ఫలితాన్ని అందుకోవడంతో ఈ సినిమా నిర్మాత ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. ఈ రూమర్ల గురించి కంగనా రనౌత్ స్పందిస్తూ షాకింగ్ కామెంట్లు చేశారు. ధాకడ్ మూవీ గురించి ఇంటర్నెట్ లో నెగిటివ్ ప్రచారం జరిగిందని కంగనా అన్నారు.

నెగిటివ్ ప్రచారం వల్లే ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచిందని కంగనా చెప్పుకొచ్చారు. ఇంటర్నెట్ లో కొందరు చిల్లర వ్యక్తులు ఈ సినిమా గురించి నెగిటివ్ గా ప్రచారం సాగించారని కంగనా రనౌత్ పేర్కొన్నారు. ఈ సినిమా వల్ల నిర్మాత ఆస్తులు అమ్ముకున్నారని జరిగిన ప్రచారంలో నిజం లేదని కంగనా రనౌత్ వెల్లడించారు. ఈ సినిమా రిజల్ట్ విషయంలో ధాకడ్ ప్రొడ్యూసర్ పాజిటివ్ గానే ఉన్నారని కంగనా రనౌత్ అన్నారు.

ధాకడ్ మూవీ గురించి నెగిటివ్ వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయని ఆ వార్తల వల్లే సినిమా ఫ్లాప్ అయిందని కంగనా రనౌత్ కామెంట్లు చేశారు. ధాకడ్ సినిమా ఫ్లాప్ గురించి రాసిన వాళ్లు జుగ్‌జుగ్‌జీయో, 83, గంగూబాయి కథియావాడి సినిమాల గురించి ఎందుకు రాయడం లేదని ఆమె ప్రశ్నించారు. ప్రస్తుతం జీ5 ఓటీటీలో ధాకడ్ సినిమా స్ట్రీమింగ్ అవుతుండగా సినిమా ఫ్లాపైనా కంగనాకు పొగరు తగ్గలేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Share.