మణికర్ణికకు దర్శకురాలిగా మారిన కంగనా రనౌత్

  • August 22, 2018 / 11:20 AM IST

బాలీవుడ్ లో బోల్డెస్ట్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకోవడంతోపాటు.. తనదైన వ్యవహార శైలి, యాటిట్యూడ్ తో క్రేజ్ సంపాదించుకొన్న కథానాయకి కంగనా రనౌత్. స్టార్ డమ్ వచ్చింది కానీ ఈమధ్యకాలంలో సరైన విజయాలు లేకపోవడం వలన కథానాయికల రేస్ లో కాస్త వెనుకబడింది. ఆ కారణంగా ఆమెను ఇండస్ట్రీలో సీరియస్ గా తీసుకోవడం మానేశారు. అయితే.. ఎప్పట్లానే ఆ విషయాలను పెద్దగా పట్టించుకోని కంగనా రాణి ఝాన్సీ లక్ష్మీభాయ్ జీవితం ఆధారంగా క్రిష్ తెరకెక్కిస్తున్న “మణికర్ణిక”లో నటిస్తూ బిజీగా గడుపుతోంది. అయితే.. ఈ సినిమా మొదలై ఏడాదిన్నర కావస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కాస్త లేట్ అవ్వడంతో సినిమా రిలీజ్ లేట్ అవుతూ వచ్చింది.

అయితే.. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ తో చిత్రాన్ని జనవరిలో విడుదల చేస్తున్నట్లు ప్రకటించడంతో కంగనా ఈ విషయాన్ని కాస్త సీరియస్ గా తీసుకొంది. కాకపోతే.. క్రిష్ ఇటీవల “ఎన్టీఆర్” బయోపిక్ షూట్ లో బిజీ అయిపోవడంతో వేరే దారి లేక “మణికర్ణిక” ప్రొజెక్ట్ ను స్వయంగా డీల్ చేయడం మొదలెట్టింది కంగనా. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ నుంచి ప్యాచ్ వర్క్ వరకూ అన్నీ స్వయంగా చూసుకోంటోంది. ఈ విషయమై క్రిష్ కాస్త ఇబ్బందిపడినా తనకిప్పుడు “ఎన్టీయార్” బయోపిక్ ఇంపార్టెంట్ అవ్వడంతో సైలెంట్ అయిపోయాడట.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus