దర్శకుడు అంటే ఎవరు, సినిమాను తనదైన స్టైల్ లో తెరకెక్కించే వాడు. అంతేకాదు క్రియేటివిటీకి కేర్ ఆఫ్ అడ్రెస్ గా ఉండాల్సిన వాడు. అయితే అలాంటి ఒక దర్శకుడు అడ్డదారులు తొక్కుతున్నాడు. అమ్మాయిలను రూమ్ కి తీసుకు వచ్చి, అదో రకమైన్ వ్యాపారం చేస్తున్నాడు. విషయంలోకి వెళితే, ఈ ఇష్యూ కర్నాటక రాష్ట్రంలో బెంగళూరులో జరిగింది. అసలు ఎవరు ఆ దర్శకుడు ఏమిటి ఆ కధ అంటే, ఒకసారి ఈ కధ చదవాల్సిందే. కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే దర్శకుడిగా ఏదుగుతున్నాడు ప్రఖ్యాత్ అనే చిన్న దర్శకుడు. అయితే ఇప్పటికే ఒక చిన్న సినిమా ‘కత్రిగుప్పె కట్టింగ్ షాప్’ ను డైరెక్ట్ చేసి మంచి హిట్ అందుకున్నాడు ఈ యువ దర్శకుడు. అదే క్రమంలో తన తరువాత ప్రాజెక్ట్స్ పై ఫోకస్ చేసేందుకు తన స్నేహితుడు ఆయున పురుషోత్తమ్ కు చెందిన ఒకైల్లు అద్దెకు తీసుకున్నాడు. అక్కడనుంచే తన కార్యకలాపాలు జరుపుతూ వస్తున్నాడు. ఇదిలా ఉంటే అసలు విషయం ఇక్కడే మొదలయ్యింది. పోనీలే స్నేహితుడే కదా అని ఇంటిని అద్దెకు ఇస్తే, ఇష్టారాజ్యంగా వ్యవహరించి, బెదిరింపులకు దిగిన కన్నడ సినీ దర్శకుడు ప్రఖ్యాత్ బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అయితే ఇంతకీ పోలీసులు ఇతన్ని ఎందుకు అరెస్ట్ చేశారు అంటే తన స్నేహితుడైన పురుషోత్తమ్ కు చెందిన ఇంటిని అద్దెకు తీసుకున్న ఈ దర్శకుడు మొదట్లో కాస్త జాగ్రత్తగా ఉన్నా, తరువాత ఆడిషన్స్ పేరుతో అమ్మాయిలను ఇంటికి తీసుకువస్తూ ఇష్టారీతిన వ్యవహరిస్తూ ఉండేవాడట. దీంతో ఆ చుట్టుపక్కల నివాసం ఉంటున్నవారు ఇబ్బంది పడి పరుషోత్తమ్ కు ఫిర్యాదు చేశారు. ఆడిషన్స్ పేరుతో అమ్మాయిలను తీసుకొచ్చి గుట్టుగా వ్యాపారం చేస్తున్నాడని ఆరోపించారు. దీంతో పురుషోత్తం ఆ వ్యవహారాన్ని వ్యక్తిగతంగా పరిశీలించి, విధానం మార్చుకోవాలని మిత్రుడికి సూచించాడు. లేని పక్షంలో ఇంటిని ఖాళీచేయాలని హెచ్చరించాడు. దీనిపై రగిలిపోయిన ప్రఖ్యాత్ కొంతమంది రౌడీలతో పురుషోత్తంను బెదిరించాడు. దీంతో పురుషోత్తమ్ పోలీసులను ఆశ్రయించాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, ప్రఖ్యాత్ ను అరెస్ట్ చేశారు. మొత్తంగా సినిమాలు తీయాల్సిన దర్శకుడు దారి తప్పి తప్పుడు వ్యాపారాలు చేయిస్తూ ఇలా అడ్డంగా దొరికిపోయాడు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.