Kannappa Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘కన్నప్ప’.. కానీ?

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా ‘కన్నప్ప'(Kannappa) రూపొందింది. దాదాపు రూ.200 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని మంచు విష్ణు నిర్మించడం జరిగింది.ఈ సినిమాకి కథా రచయిత కూడా అతనే. విష్ణు కెరీర్లో ఇది బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీ.

అయితే ఈ ప్రాజెక్టు పై అందరి దృష్టి పడటానికి ముఖ్య కారణం ఈ సినిమాలో ప్రభాస్ నటించడం. అవును రుద్ర అనే పాత్రలో ప్రభాస్ నటించాడు.దాదాపు 20 నిమిషాల నిడివి కలిగిన పాత్ర ఇది. అందుకే ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ ను సొంతం చేసుకుంది. 2025 జూన్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

టాకైతే పర్వాలేదు అనే రేంజ్లో తెచ్చుకుంది. ఓపెనింగ్స్ కూడా ఓకే ఓకే అనే రేంజ్లో వచ్చాయి. మంచు విష్ణు కెరీర్లో ఇవి బిగ్గెస్ట్ ఓపెనింగ్సే. కానీ తర్వాత డౌన్ అయిపోయింది. ఒకసారి ‘కన్నప్ప’ క్లోజింగ్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 7.40 cr
సీడెడ్ 2.58 cr
ఉత్తరాంధ్ర 2.38 cr
ఈస్ట్ 1.30 cr
వెస్ట్ 0.92 cr
గుంటూరు 1.05 cr
కృష్ణా 0.93 cr
నెల్లూరు 0.85 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 17.41 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 4.65 Cr
ఓవర్సీస్ 2.67 Cr
వరల్డ్ వైడ్ (టోటల్) 24.73 cr(షేర్)

‘కన్నప్ప’ చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.86 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.87 కోట్లు షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ సినిమా కేవలం రూ.24.73 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.45.1 కోట్లు కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కి రూ.62.27 కోట్ల షేర్ దూరంలో ఆగిపోయి డిజాస్టర్ గా మిగిలింది ఈ సినిమా.

తెలుగులోకి సూపర్ హిట్ రొమాంటిక్ సిరీస్.. ETV Win మాస్టర్ ప్లాన్

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus