Kannappa Twitter Review: మంచు విష్ణుకి ప్రభాస్ హిట్ ఇచ్చాడా?

[Click Here For Detailed Review]

మంచు విష్ణు (Manchu Vishnu) హీరోగా, కథకుడిగా, నిర్మాతగా ‘కన్నప్ప’ (Kannappa) రూపొందింది. రూ.200 కోట్ల భారీ బడ్జెట్ తో మంచు విష్ణు ఈ చిత్రాన్ని నిర్మించారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అక్షయ్ కుమార్, శివరాజ్ కుమార్, శరత్ కుమార్, మోహన్ బాబు, ప్రభాస్ వంటి స్టార్స్ అంతా నటించారు. ముఖ్యంగా ప్రభాస్ కి పాన్ ఇండియా క్రేజ్ వల్ల ఇండియాలో ‘కన్నప్ప’ (Kannappa) గ్రాండ్ రిలీజ్ ను సొంతం చేసుకుంది. బాలీవుడ్లో కూడా ‘కన్నప్ప’ ఎక్కువ థియేటర్లలో రిలీజ్ కాబోతుంది.

Kannappa Twitter Review

ఈ సినిమా టీజర్, ట్రైలర్ వంటివి ప్రేక్షకులను ఇంప్రెస్ చేశాయి. మైథలాజికల్ కంటెంట్ తో రూపొందిన సినిమాలని థియేటర్ కి వచ్చి చూడడానికి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. ఆ రకంగా ‘కన్నప్ప’ (Kannappa) ప్రత్యేకతను సంతరించుకుంది. ఆల్రెడీ కర్ణాటకలో 2 గంటలకు షోలు పడ్డాయి. అక్కడ తెలుగు జనాలు ఎక్కువగా ఉండటం వల్ల ‘కన్నప్ప’ ని చాలా మంది చూసి.. తమ అభిప్రాయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. వారి టాక్ ప్రకారం.. ‘కన్నప్ప’ ఇంట్రెస్టింగ్ గా మొదలయ్యిందట.

ప్రీ ఇంటర్వెల్ బ్లాక్ నుండి వేగం అందుకుందని అంటున్నారు. సెకండాఫ్ లో వచ్చే ప్రభాస్ ఎంట్రీ గూజ్ బంప్స్ తెప్పిస్తుంది అని చెబుతున్నారు. మోహన్ లాల్, అక్షయ్ కుమార్.. రోల్స్ కూడా బాగా డిజైన్ చేసినట్టు చెబుతున్నారు. క్లైమాక్స్ ఎమోషనల్ గా ఉంటుందట. మొత్తానికి ‘కన్నప్ప’ కి (Kannappa) పాజిటివ్ గానే చెబుతున్నారు. మరి మార్నింగ్ షోల నుండి ఎలాంటి టాక్ వస్తుందో చూడాలి.

‘కన్నప్ప’ లో ప్రభాస్ ఫైట్.. కేవలం హైప్ కోసమా?

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus