మీరు నాకు విడాకులు ఇప్పించేలా ఉన్నారే : కరీనా కపూర్

  • February 20, 2016 / 11:32 AM IST

కరీనా కపూర్, అర్జున్ కపూర్ జంటగా నటించిన ‘కి అండ్ కా’ చిత్రం యొక్క పోస్టర్లు ఇటీవల బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. పెళ్ళైన తర్వాత ముద్దు సన్నివేశాలకు దూరంగా ఉంటానని కరీనా చెప్పినట్లు అప్పట్లో వార్తలు కూడా వినిపించాయి. తాజాగా ఆమె ముద్దు సన్నివేశంలో పాల్గొనడంతో ఆ వార్తలు ఇప్పుడు ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తుండటంతో తాజాగా ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా కరీనా కపూర్ స్పందించింది.
తను పెళ్ళైన తర్వాత ముద్దు సన్నివేశాల్లో నటించేదిలేదని ఎప్పుడు చెప్పానంటూ కరీనా ఆశ్చర్యం వ్యక్తం చేసింది. తను అలాంటి పాలసీలు ఏమి పెట్టుకోలేదని ఆ వార్తలు ఎలా వచ్చాయో తనకి తెలియదని చెప్పుకొచ్చింది. తాజాగా ఈ ట్రైలర్ లాంచ్ సందర్భంగా అక్కడున్న ఫోటోగ్రాఫర్లు ఆ ముద్దు సన్నివేశాన్ని మరోసారి చేయాలని కరీనా,అర్జున్ కపూర్ లను కోరగా కరీనా చిరాకుతో మీరు నాకు విడాకులు ఇప్పించేలా ఉన్నారే అంటూ కామెంట్ చేసింది. ఆ తర్వాత అర్జున్ మంచి కిస్సర్ అంటూ అతని బుగ్గపై ఒక చిన్న ముద్దు పెట్టింది కరీనా. ఈ చిత్రంలో కరీనా కపూర్ ఒక ఉద్యోగం చేసే మహిళగా.., అర్జున్ కపూర్ ఇంట్లో ఉండే భర్తగా నటిస్తున్నారు. తాజాగా విడుదల చేసిన ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది.
Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus