బాలీవుడ్ హీరోకి షాకిచ్చిన బెంగుళూరు పోలీసులు..!

  • October 16, 2020 / 02:25 PM IST

ప్రముఖ బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్ ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించడం పై హిందీ సినీ పరిశ్రమ షాక్ కు గురయ్యింది.అసలు విషయంలోకి వెళితే.. మొన్నటి వరకూ బాలీవుడ్లో అలాగే ఇప్పుడు శాండిల్ వుడ్లో డ్రగ్స్ కేసులు పెద్ద ఎత్తున రచ్చ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆదిత్య అల్వాను కూడా నిందితుడుగా గుర్తించారు పోలీసులు.ఈ విషయం ముందుగా తెలీడంతో ఆదిత్య అల్వా పరారీలో ఉన్నాడని కూడా ప్రచారం జరిగింది.

దీంతో పోలీసులకు మరింత అనుమానం పెరిగింది. అందుకే అతన్ని ఎలాగైనా సరే పట్టుకోవాలని గాలిస్తున్నారట. ఇందులో భాగంగా.. ఆదిత్య బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్ కు బంధువన్న సంగతి తెలిసిందే. అందుకే బెంగళూరు పోలీసులు వివేక్ ఇంట్లో సోదాలు నిర్వహించారట.ఇందుకు గాను వారు.. కోర్టు వారంట్ కూడా తీసుకున్నారట. అటు తర్వాతే క్రైమ్ బ్రాంచ్ పోలీసులు వివేక్ ఇంటికి వెళ్ళారట.ఆదిత్య…. వివేక్ ఇంట్లో ఉన్నాడనే సమాచారం అందడంతో పోలీసులు వివేక్ ఇంటికి వెళ్ళి సోదాలు నిర్వహించారట.

అయితే ఆదిత్య అక్కడ లేడని వారు కన్ఫర్మ్ చేసుకున్నారని కూడా తెలుస్తుంది.సెన్సేషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన ‘రక్త చరిత్ర'(సిరీస్) తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు వివేక్ ఒబెరాయ్. తరువాత ‘వినయ విధేయ రామ’ చిత్రంలో చరణ్ ఢీకొట్టే విలన్ గా కూడా నటించాడు.

Most Recommended Video

టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!
బిగ్‌బాస్‌ ‘రౌడీ బేబీ’ దేత్తడి హారిక గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus