చైతూ హీరోయిన్ కూ తప్పని తిప్పలు

టాలీవుడ్ పై హీరోయిన్ రాధ చెర‌గ‌ని ముద్ర వేసింది.. డ్యాన్స్ ల్లో మెగా స్టార్ తో పాటు వేసి మెప్పించిన న‌టి.. అలాగే గ్లామ‌ర్ పాత్ర‌ల‌కు ఆమె కేరాఫ్ అడ్ర‌స్ కూడా ఆమె.. మూవీల నుంచి దూరంగా ఉంటున్న రాధ త‌న వార‌స‌త్వంలో కుమార్తె కార్తీక‌ను దించింది.. నాగచైతన్య పరిచయ చిత్రమైన “జోష్” సినిమాతో తెరంగేట్రం చేసిన కార్తీక ఆ చిత్రం ఫ్లాప్ అవ్వడంతో తెలుగులో ఆశించిన స్థాయిలో ఆఫర్లు అందుకోలేకపోయింది. ఆ తర్వాత ఎన్టీఆర్ “దమ్ము” సినిమాలో కార్తీక మెరిసింది.. ఆ సినిమాలో కాస్త గ్లామర్ డోస్ పెంచినప్పటికీ ఆమెకు తెలుగులో పీడగా ఆఫర్లు రాలేదు. అనంతరం తమిళంలో “రంగం” చిత్రంలో నటించి సూపర్ హిట్ అందుకొన్నా ఆ క్రెడిట్ మొత్తం జీవా ఖాతాలోకి వెళ్లిపోవడంతో ఆమెకు అక్కడ కూడా ఆఫర్లు అందలేదు.

ఆ త‌ర్వాత త‌మిళ‌, క‌న్న‌డ, తెలుగు సినిమాల్లోనూ న‌టించింది.. అయితే ఆమెకు ఏ ఒక్క మూవీ బ్రేక్ తీసుకురాలేక‌పోయింది.. త‌ల్లి రాధ‌లా అక‌ర్షించే రూపం లేక‌పోవ‌డం అమెకు పెద్ద మైన‌స్ అనే టాక్ కూడా వ‌చ్చింది. అయితే.. నిన్నమొన్నటివరకూ ఎక్స్ పోజింగ్ మరియు గ్లామర్ డోస్ విషయంలో కొన్ని లిమిట్స్ పెట్టుకొన్న కార్తీక్.. ఇప్పుడు వాటి నుంచి బయటకు వచ్చింది. అందాలు ఆర‌బోస్తే త‌ప్ప పాత్ర‌లు రావ‌ని గ్ర‌హించిన ఈ భామ హాట్ ఫోటో షూట్ ల‌కు తెర లేపింది. గ్లామ‌ర్ షో కి రెడీ అంటూ స్కిన్ షో పోటోల‌ను వ‌దిలింది.. మ‌రి ఈ ఫోటోల‌ను చూసి ఎవ‌రైనా చాన్స్ లిస్తారో లేదో చూడాలి మ‌రి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus