బుల్లితెర పై దుమ్ము రేపిన కార్తికేయ ’90 ఎం.ఎల్’..!

  • May 15, 2020 / 02:09 PM IST

‘ఆర్.ఎక్స్.100′ చిత్రంతో యూత్ లో క్రేజ్ ను సంపాదించుకున్న కార్తికేయ.. ఆ తర్వాత ఆ స్థాయి హిట్ అయితే అందుకోలేకపోయాడనే చెప్పాలి. మంచి ప్రయత్నాలే చేస్తున్నాడు కానీ వర్కౌట్ కావడం లేదు.’ఆర్.ఎక్స్.100’ చిత్రం తర్వాత చేసిన ‘హిప్పీ’ చిత్రం డిజాస్టర్ అయ్యింది. కానీ అతని నటనకు, డ్యాన్స్ లకు మంచి మార్కులే పడ్డాయి. ఇక ‘గుణ 369’ చిత్రానికి మంచి రివ్యూలు వచ్చాయి కానీ బ్రేక్ ఈవెన్ కాలేదు… జస్ట్ యావరేజ్ ఫలితంతో సరిపెట్టుకుంది.

ఇక అటు తర్వాత చేసిన ’90.ఎం.ఎల్’ చిత్రం అట్టర్ ప్లాప్ అంటూ ప్రేక్షకులు పెదవి విరిచారు. కానీ టీజర్, ట్రైలర్ సినిమా పై తెచ్చిన హైప్ కు కలెక్షన్లు బాగా రావడంతో యావరేజ్ గా నిలిచింది. అయితే ఈ చిత్రం టీవీల్లో మాత్రం సూపర్ హిట్ గా నిలిచింది. ఇటీవల ఈ చిత్రం ప్రీమియర్ ను ‘స్టార్ మా’ వారు టెలికాస్ట్ చెయ్యగా అదిరిపోయే టి.ఆర్.పి రేటింగ్ ను సాధించింది. ఎవ్వరూ ఊహించని విధంగా ఈ చిత్రానికి 10.92 టి.ఆర్.పి నమోదు చేసింది.

దీంతో ఈ చిత్రం కొన్న ‘స్టార్ మా’ వారికి పెట్టిన పెట్టుబడి వెనక్కి రావడంతో పాటు.. లాభాలు కూడా దక్కినట్టు తెలుస్తుంది. మరోసారి టెలికాస్ట్ చేస్తే లాభాలు వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. లాక్ డౌన్ వల్ల కూడా ఈ చిత్రానికి కలిసొచ్చిందని చెప్పాలి. ఇక కార్తికేయ … తమిళ స్టార్ హీరో అజిత్ సినిమాలో కూడా ఛాన్స్ కొట్టేసిన సంగతి తెలిసిందే.

Most Recommended Video

దిల్ రాజు రెండో పెళ్ళి చేసుకున్న అమ్మాయి ఎవరో తెలుసా?
ఈ ఏడు రీజన్స్ తెలిస్తే ఆర్ ఆర్ ఆర్ ని వదిలిపెట్టరు
అతి తక్కువ వయసులో లోకం విడిచిన తారలు

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus