కాటమరాయుడు యాక్షన్ సీన్ తెరకెక్కిస్తున్న డాలీ

  • November 29, 2016 / 06:54 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  డాలీ దర్శకత్వంలో నటిస్తున్న కాటమరాయుడు షూటింగ్ వేగంగా జరుగుతోంది. ప్రముఖ నిర్మాత శరత్ మరార్ నిర్మిస్తున్న ఇందులో శృతిహాసన్ ప్రధాన హీరోయిన్ గా నటిస్తోంది. మరో హీరోయిన్ యామిని భాస్కర్ తోను పవన్ రొమాన్స్ చేయనున్నారు. పవర్ స్టార్ తొలిసారిగా ఫ్యాక్షన్ లీడర్ గా కనిపించనున్న ఇందులో ఆయనకు తమ్ముళ్లుగా అజయ్, శివబాలాజీ, కమల్ కామరాజులు నటిస్తున్నారు. రాయల సీమ నేపథ్యంలో సాగే ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. అక్కడ వేసిన ప్రత్యేక రైల్వే స్టేషన్ సెట్ లో పవర్ స్టార్ పై ఓ యాక్షన్ సీన్ ని తెరకెక్కిస్తున్నారు.

వైట్ అండ్ వైట్ డ్రస్సులో కర్ర చేత బట్టి పోకిరీలను పవర్ తరిమి తరిమి కొట్టే సన్నివేశాన్ని రామ్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో షూట్ చేస్తున్నారు. ఈ ఫైట్ సినిమాలో హైలెట్ కానుందని చిత్ర బృందం వెల్లడించింది. ఈ సన్నివేశంలో శృతి హాసన్ కూడా పాల్గొంది. ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించిన వారినే కాటమరాయుడు చితక బాదినట్లు తెలుస్తోంది. గబ్బర్ సింగ్ లో వీరిద్దరి కెమిస్ట్రీ సూపర్ గా వర్కౌట్ అయింది. ఇందులోనూ ఆ కెమిస్ట్రీ రిపీట్ అవుతుందని దర్శకుడు డాలీ దైర్యంగా ఉన్నారు. దీపావళి కి రిలీజ్ చేసిన కాటమరాయుడు మోషన్ పోస్టర్ లో దీపాలను వెలిగిస్తున్న పవన్, శృతిహాసన్ లను చూసి ఫ్యాన్స్ హిట్ గ్యారంటీ అని ఫిక్స్ అయ్యారు. అనూప్ రూబెన్స్ సంగీతమందిస్తున్న ఈ సినిమా ఉగాది కానుకగా థియేటర్లలోకి రానుంది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus