సెన్సార్ పూర్తి చేసుకున్న కాటమరాయుడు

  • March 15, 2017 / 12:21 PM IST

డాలీ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న‘కాటమరాయుడు’ సినిమా సెన్సార్  పూర్తి చేసుకుంది. నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ మూవీ యూరప్ లో షూటింగ్ పూర్తి చేసుకొచ్చిన వెంటనే ఎడిటింగ్ జరుపుకొని నిన్న సెన్సార్ సభ్యుల ముందుకు వెళ్లింది. వారు ఈ రోజు కాటమరాయుడు చిత్రాన్ని చూసి ఎటువంటి కట్స్ చెప్పకుండా యూ సర్టిఫికెట్ అందజేశారు. దీంతో రిలీజ్ కి అంతా క్లియర్ అయింది. పవర్ స్టార్ తొలిసారి ఫ్యాక్షన్ లీడర్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఉగాది కానుకగా మార్చి 24 న థియేటర్లోకి తీసుకురానున్నారు.

ఈ చిత్రానికి ప్రీమియర్ షోలు భారీ ఎత్తున ప్లాన్ చేసినట్లు సమాచారం. అమెరికాలో అయితే 23వ తేదీన ప్రీమియర్ షోలను ప్రదర్శించనున్నారు. రీసెంట్ గా విడుదలయిన టీజర్, పాటలు రికార్డులు సృష్టిస్తున్నాయి. దీంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇక ఈ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను  హైదరాబాద్ లో ఈ నెల 18వ తేదీన నిర్వహించాలని నిర్మాత ఏర్పాట్లు చేస్తున్నారు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus