పవన్ సినిమాపై ‘సిల్లీ’ రూమర్స్!!!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమా అంటేనే ఆయన ఫ్యాన్స్ కి పండగ…అంతేకాదు ఆయన సినిమా వస్తుంది అంటే చాలు….థియేటర్స్ వద్ద హంగామా అంతా ఇంతా కాదు. అదే క్రమంలో పవన్ సినిమా ఫలితం ఎలా ఉన్నా నిర్మాతలు, బయ్యర్స్ మాత్రం సేఫ్ జోన్ లో ఉండిపోతారు. ఆది పవన్ స్టామినా….మరి అలాంటి పవన్ ఇప్పుడు “కాటమరాయుడా” అనే సినిమా తీస్తున్నట్లు అందరికీ తెలిసిందే. అంతేకాదు ఈ సినిమాను కడప ఫ్యాక్షన్ నేపధ్యంలో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో పవన్ ఒక ఫ్యాక్షన్ నాయకుడిగా నటిస్తున్నాడు అని తెలుస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాపై కొన్ని సిల్లీ రూమర్స్ ఇండస్ట్రీలో హల్‌చల్ చేస్తున్నాయి. అందులో ఈ రెండు రూమర్స్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.

ఇంతకీ ఏంటి ఆ రూమర్స్ అంటే….మొదటిది…ఈ కాటమరాయుడు చిత్రాన్ని తమిళ్ మూవీ వీరమ్ కి పవన్ స్టైల్లో మార్చేసిన రీమేక్ గా తెరకెక్కిస్తున్నారట. ఇక ఇప్పటికీ వీరమ్ సినిమా తెలుగులో సైతం “వీరుడొక్కడే” పేరుతో డబ్బింగ్ అయ్యి మంచి హిట్ సాధించింది. అదే క్రమంలో ఆ డబ్బింగ్ సినిమాని యాజ్ఇటీజ్ తీసేసి.. తెలుగులో మళ్లీ సినిమా రిలీజ్ చేస్తున్నాడు పవన్ అని సిల్లీ న్యూస్ ఒకటి స్ప్రెడ్ అయ్యింది….అయినా ఆల్‌రెడీ వచ్చిన సినిమాను తీసి మళ్లీ రిలీజ్ చెయ్యడానికి పవన్ ఏమన్నా తెలివి తక్కువ వాడా ?అదే క్రమంలో శర్వానంద్.. రాజ్ తరుణ్.. విజయ్ దేవరకొండలను.. పవన్ తమ్ముళ్లుగా తీసుకునే అందుకు పవన్ అండ్ టీమ్ అప్రోచ్ అయితే వారి నో చెప్పారని వార్త…ఇంతకన్నా వెటకారం ఇంకా ఏమైనా ఉంటుందా?? ఓ సినిమాలో పవన్ పక్కన ఓ ఫ్రేమ్ లో నుంచుంటే చాలని అనుకునే హీరోలు చాలామందే ఉన్నారు. అలాంటిది పవన్ అడగడం వారు ఒప్పుకోక పోవడం చాలా సిల్లీగా అనిపించడం లేదు…..ఏది ఏమైనా…ఇవన్నీ రూమర్స్ అని నిర్మాత శరత్ మరార్.. వాళ్లెవరినీ అప్రోచ్ అవలేదని.. పక్కా క్లారిటీగా చెబుతున్నాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus