బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన తాజా చిత్రం ‘భారత్’. ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించింది కత్రీనా. రంజాన్ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా జూన్ 5 న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఇక ఈ చిత్ర ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటుంది కత్రినా. ఈ ప్రమోషన్స్ లో భాగంగా కొన్ని ఆసక్తి కరమైన కామెంట్స్ కూడా చేసింది ఈ బాలీవుడ్ బ్యూటీ. ‘ఆడవారితో సహజీవనం చేయాల్సివస్తే మీరు ఎవరితో చేయడనికి ఇష్టపడతారు ? అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకి కత్రినా షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది
కత్రీనా మాట్లాడుతూ.. “నాకు అలా జీవించాల్సివస్తే కరీనా కపూర్ ని జీవిత భాగస్వామిగా ఎన్నుకుంటాను. కరీనా చాలా ధైర్యం కలిగిన అందమైన నటి, ఆమెతో వర్క్ చేయడం నాకు చాలా ఆహ్లాదంగా ఉంటుంది.” పలు దేశాల్లో ఈ సంస్కృతి ఎప్పటి నుండో ఉండగా.. మనదేశంలో కూడా ఇలాంటి రిలేషన్స్ ని చట్టబద్దం చేసారు. ఐతే సంప్రదాయవాదులు ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్న సంగతి తెలిసిందే. మరి ఇలాంటి టైములో కత్రినా వ్యాఖ్యలు ఎన్నివివాదాలకు దారితీయనున్నాయో చూడాలి…!