కొన్ని పనులు మనకి ఉపయోగపడుతాయని చేస్తాం.. కానీ ఒక్కోసారి అది రివర్స్ అయి.. మనకి నష్టాన్ని మిగుల్చుతాయి. ఇప్పుడు నానికి ఈ పరిస్థితి ఎదురైంది. పక్కింటి కుర్రోడుగా.. నేచురల్ స్టార్ గా పేరు తెచ్చుకున్న నాని.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 షోకి హోస్ట్ గా అవకాశం దక్కించుకున్నారు. ఈ షో ద్వారా మరింతమంది అభిమానులను సంపాదించుకోవాలనుకున్నారు. కానీ శత్రువులను సంపాయించుకున్నారు. షోలో కౌశల్ చెప్పిన ఒక్క మాటని పట్టుకొని విమర్శించినందుకు అతని అభిమానులు ఆవేశం వ్యక్తం చేస్తున్నారు. ఇదివరకు షోలో “సిల్లీ ఫెలోస్” సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సునీల్ మరియు అల్లరి నరేష్ బిగ్ బాస్ హౌజ్లోకి వెళ్లారు. అప్పుడు ఆడిన పెదరాయుడు స్కిట్ లో కౌశల్ తల్లి పాత్రను పోషించారు.
ఆ తల్లి పాత్రను నాని ప్రశ్నిస్తూ.. “ఇద్దరు కొడుకులను ఎందుకు దత్తత తీసుకున్నారు. మీ ఆయనతో స్పర్శ వర్కౌట్ కాలేదా? అంటూ ప్రశ్నించారు”. ఆ వ్యాఖ్యలను ప్రస్తుతం కౌశల్ ఆర్మీ గట్టిగా పట్టుకుంది. సోషల్ మీడియాలో కౌశల్ ఆర్మీ హైదరాబాద్ పోలీసులను ట్యాగ్ చేసి ఆడవారిని గురించి అనుచితంగా మాట్లాడినందుకు నానిపై కేసు నమోదు చేయాలని పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ పై స్పందించిన హైదరాబాద్ పోలీసులు “మీ లోకల్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టండి” అంటూ సమాధానం వచ్చింది. దాంతో ఇప్పుడు కౌశల్ ఆర్మీ మెంబర్స్ నానిపై కేసు ఫిర్యాదుకు సిద్దం అవుతున్నారు. వారు కేసు పెడితే నాని పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. దేవదాస్ సినిమాని పూర్తి చేసే పనిలో ఉన్న నానికి ఈ వ్యవహారం తలనొప్పిగా మారింది.