అల్లు అర్జున్(Allu Arjun) ఇటీవల ఘోరంగా ట్రోల్ అయ్యారు. వాణిజ్య ప్రకటనల్లో నటించే ఓ నటి అల్లు అర్జున్ పై చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున చర్చనీయాంశం అయ్యాయి. దీంతో అల్లు అర్జున్ టీమ్ వాటిలో నిజం లేదు అని స్పందించడం. ఆ తర్వాత 2 రోజులకి అల్లు అర్జున్ ని కలిసినప్పుడు పాటించాల్సిన 42 నిబంధనలు అంటూ ఓ నోట్ వైరల్ అయ్యింది. ఇవి యాంటీ ఫ్యాన్స్ కి వెపన్స్..లా మారిపోయాయి. దీంతో సోషల్ మీడియాలో అల్లు అర్జున్ తో ఒక్కో రూల్ తో తెగ ట్రోల్ చేశారు యాంటీ ఫ్యాన్స్.
అయితే తాజాగా కావేరీ బారువా అల్లు అర్జున్ పై చేసిన కొమెంట్స్ ని వెనక్కి తీసుకుంటున్నట్టు తెలిపి అందరికీ షాకిచ్చింది.తన సోషల్ మీడియా ద్వారా కావేరీ బారువా ఈ విధంగా స్పందించింది. ఆమె మాట్లాడుతూ.. “గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో నా పాడ్ క్యాస్ట్ కి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతుంది. ఆ వీడియోలో నేను అల్లు అర్జున్ గురించి చేసిన వ్యాఖ్యలు తప్పుగా వెళ్ళాయి. బహుశా నేను అలా మాట్లాడటం కూడా తప్పే అనిపిస్తుంది.
అల్లు అర్జున్ తో యాడ్ షూట్ చేసే టైమ్లో తప్పకుండా పాటించాల్సిన 42 నియమాలు అలాగే అతని టీమ్ గురించి నేను మాట్లాడింది తప్పే. ఆధారాలు లేకుండా నేను అలా మాట్లాడటం కరెక్ట్ కాదు. కాబట్టి నా వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నాను. ఏదో ఫ్లోలో అలా వెళ్లిపోయాయి.అల్లు అర్జున్ గౌరవ, మర్యాదలకి అవి భంగం కలిగించే విధంగా ఉన్నాయని నాకు తెలిసింది. అందుకే నా వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిసైడ్ అయ్యాను” అంటూ చెప్పుకొచ్చింది.
ఆమె కామెంట్స్ చూస్తుంటే.. ‘బలవంతంగా చెప్పినట్టు ఉన్నాయని… బహుశా అల్లు అర్జున్ టీమ్ ఆమెను బ్లాక్ మెయిల్ చేసో లేదంటే డబ్బులు ఇచ్చో ఈ పోస్ట్ పెట్టించి ఉంటుందని’ కొందరు నెటిజెన్లు, ముఖ్యంగా అల్లు అర్జున్ యాంటీ ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఏదేమైనా అఫీషియల్ ఆమె క్షమాపనలు చెప్పి ఈ ఇష్యూకి ఫుల్స్టాప్ పెట్టే ప్రయత్నం చేసింది కాబట్టి..దాన్ని అందరూ స్వాగతించాల్సిందే.