Kayadu Lohar: ‘ఫంకీ’ వల్ల లాభపడిన ఏకైక వ్యక్తి ఎవరో తెలుసా? త్వరలో క్యూలైన్లు

సినిమా ఫలితం ఎలా ఉన్నా.. అందులో నటించేవారికి లాభమే! – టాలీవుడ్‌లో రీసెంట్‌గా జరుగుతున్న విషయాలు, సినిమాల ఫలితాలు, అందులో నటించిన కథానాయికల తర్వాత లైనప్‌లు చూస్తుంటే ఈ మాట అనాలని అనిపిస్తోంది. మొన్నీమధ్య వరకు భాగ్యశ్రీ భోర్సే విషయంలో ఇలానే మాట్లాడుకున్న సినీ గోయర్స్‌ ఇప్పుడు కయాదు లోహర్‌ గురించి అనుకుంటున్నారు. ఎందుకంటే ఆమె నటించిన ‘ఫంకీ’ సినిమా ఫలితానికి, ఆమె సంపాదించుకున్న క్రేజ్‌కి ఏ మాత్రం సంబంధం లేదు.

Kayadu Lohar

నిజానికి కయాదు లోహర్‌ టాలీవుడ్‌కి కొత్తేమీ కాదు. నాలుగేళ్ల క్రితమే ‘అల్లూరి’ అనే సినిమాలో శ్రీవిష్ణు సరసన నటించింది. ఆ సినిమా ఫలితం సరిగ్గా రాలేదు దీంతో మళ్లీ ఇటువైపు రాలేదు. ఇప్పుడు ‘ఫంకీ’తో మళ్లీ వచ్చింది. అయితే మధ్యలో మరాఠీ, మలయాళం, తమిళ సినిమాల్లో నటించింది. ఆ వీడియోలు, అందులో ఆమె అందం మన కుర్రాళ్లకు బాగా నచ్చేసింది. దానికి ముఖ్య కారణం ‘డ్రాగన్‌’ సినిమాలో ఆమె యాక్టివ్‌నెస్‌. ఇప్పుడు అదే ఎలిమెంట్‌ ‘ఫంకీ’కి కాస్తయినా కలిసొచ్చింది.

ఆ సినిమా ఫలితం గురించి దర్శకుడు అనుదీప్‌, నిర్మాత నాగవంశీ, హీరో విశ్వక్‌సేన్‌ మరచిపోవాలి. కయాదుకి అయితే అందులోని ఆమె అప్పీల్‌ అవకాశాలు తెచ్చిపెట్టేలా ఉంది. ఇప్పటికే చేతిలో ఏడు సినిమాలతో బిజీగా ఉన్న కయాదు మరో నాలుగైదు పెద్ద సినిమాలు బ్యాగులో వేసుకునేలా ఉంది అనిపిస్తోంది. పెద్ద హీరోయిన్‌ అయ్యే ఫీచర్లన్నీ ఆమెకు ఉన్నాయి అనేది టాలీవుడ్‌ మాట. అన్నీ అనుకున్నట్లుగా జరిగి ఉండి ‘ది ప్యారడైజ్‌’ వచ్చే నెలలో వచ్చి ఉంటే ఆమె త్వరగానే పెద్ద హీరోయిన్ల లీగ్‌లోకి వచ్చేసింది.

అయితే ఇప్పుడేం కంగారు లేదు. త్వరలో ఆ లీగ్‌లోకి వచ్చి, పెద్ద సినిమాలు చేస్తుంది అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. చూద్దాం మరి లేటుగా టాలీవుడ్‌లో స్టార్‌ అయిన చాలామంది హీరోయిన్ల లిస్ట్‌లో కయాదు కూడా చేరుతుందేమో.

పూరీ జగన్నాథ్ గారిలా హీరో క్యారెక్టరైజేషన్ వరల్డ్..లో ఎవ్వరూ రాయలేరు

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus