వివాదాలకు దూరంగా ఉండే సంగీత దర్శకుడు కీరవాణి బాహుబలి కంక్లూజన్ సినిమా ఆడియో రిలీజ్ వేడుక సమయంలో చేసిన ట్వీట్స్ దుమారం రేపింది. ఆ తర్వాత సోషల్ మీడియాకి దూరంగా ఉన్న కీరవాణి మళ్లీ వార్తల్లో నిలిచారు. పైసా వసూల్ సినిమా గురించి తన అభిప్రాయాన్ని కీరవాణి ట్వీట్ చేయడంతో రచ్చ మొదలయింది. “బాలకృష్ణ అభిమానులు ‘జై హింద్’ అన్నంత ఆనందంగా, ఉత్సాహంగా “జై బాలయ్య” అని నినదిస్తున్నారు” అంటూ కీరవాణి ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ని కొంతమంది నెటిజనులు సీరియస్ గా తీసుకున్నారు. “జై బాలయ్య” నినాదాన్ని జై హింద్ తో ఎలా పోలుస్తారని విమర్శించారు.
అదే సమయంలో కొందరు కులం ప్రస్థావన కూడా తీసుకురావటంతో వివాదం మరింత పెద్దదైంది. అయితే ఈ విమర్శలపై కీరవాణి కూడా ఘాటుగా స్పందించారు. “నేను నాకు నచ్చిన విషయాలపై, నచ్చని విషయాలపై స్పందిస్తుంటాను. అంతేకానీ ఒక వర్గాన్ని ఎప్పుడూ భుజాన ఎత్తుకోలేదు. అర్జున్ రెడ్డి యూనిట్ ను కులం కోసమే ప్రశంసించానా?” అని విరుచుకు పడ్డారు. అంతేకాదు “ఫేక్ డీపీలు పెట్టుకునే కుక్కలు నా దేశ భక్తి గురించి మాట్లాడటం విడ్డూరం. నేను గత ఎన్నికల్లో ఓటేసాను.. మరి మీరు వేసారా?” అంటూ కీరవాణి తనని విమర్శించేవారి నోరు మూయించారు
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.