దక్షిణాదిన కీర్తి హవా

  • September 26, 2016 / 06:35 AM IST

తెలుగులో తొలి సినిమా (ఐనా ఇష్టం నువ్వు) విడుదల కాలేదన్న మాటే గాని తర్వాతి విడుదలైన ‘నేను శైలజ’ సినిమాతో కావలసినంత ‘కీర్తి’ గడించింది. ఆ మాటకొస్తే అదో సినిమా ఉందన్న మాట కూడా చాలామందికి తెలీదు. ‘శైలజ..’ తర్వాత సొంత గూటికి చేరుకున్న నాలుగు తమిళ సినిమాల్లో నటిస్తూ తోటి హీరోయిన్లకి ఝలక్ ఇచ్చింది.మాములుగా హీరోయిన్లు యువ హీరోలతో ఆడిపాడాకే ప్రమోషన్ అందుకుని స్టార్ హీరోలతో జంట కడతారు.

అయితే కీర్తి మాత్రం దీనికి భిన్నంగా ఓ వైపు యువ హీరోల సినిమాలు చేస్తూనే, మరోవైపు స్టార్ హీరోల సరసన నటిస్తోంది. ధనుష్ తో నటించిన ‘తొడరి’ (తెలుగులో రైల్) ఇటీవల విడుదలైంది. శివకార్తికేయన్ సరసన నటించిన ‘రెమో’ ఈ దసరాకు విడుదల కానుంది. స్టార్ హీరో విజయ్ తో చేస్తున్న ‘భైరవ’ సహా మరో తమిళ సినిమా చేస్తున్న కీర్తి తెలుగులో నాని హీరోగా తెరకెక్కుతోన్న ‘నేను లోకల్’ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా అల్లు అర్జున్ – లింగుసామి కలయికలో రానున్న ద్విభాషా చిత్రంలోను కీర్తి హీరోయిన్ గా ఎంపికైందిట. ఇలా వచ్చిన అవకాశాలను ఒడిసి పట్టుకుని హవా సాగిస్తోంది కీర్తి సురేష్.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus