కీర్తి సురేష్ అనగానే తెలుగు ప్రేక్షకులకి వెంటనే గుర్తుకు వచ్చేది ‘మహానటి’ సినిమా. ఎందుకంటే ఈ సినిమాలో హీరోయిన్ సావిత్రి గారి పాత్రలో ఆమె నటించిన తీరు అందరిని ఎంతగానో ఆకట్టుకుంది. అయితే చూడటానికి ముద్దగా, బొద్దుగా ఉండే ఈ భామకి ప్రస్తుతం చాలా సినిమాలే లైన్లో ఉన్నాయి. తమిళంలో రెండు సినిమాల్లో నటించి మెప్పించిన కీర్తి సురేష్ కి మరో రెండు తమిళ సినిమాలు చేతిలో ఉన్నాయి. ఇలా మంచి మంచి సినిమా ఆఫర్స్ సొంతం చేసుకుంటూ దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ డీ గ్లామర్ రోల్స్ పైన తన మనసులోని మాటల్ని చెప్పేసింది.
పూర్తిగా డీ గ్లామర్ రోల్స్ అంటే నాకు అసలు ఇష్టం లేదని, కానీ కథలో భాగంగా ఉండే గ్లామర్ రోల్స్ అయితే చేయడానికి నాకు అసలు ఎలాంటి ప్రాబ్లమ్ లేదని చెబుతుంది. ఇలా కథలో భాగంగా ఉండే గ్లామర్ రోల్స్ కి నేను ఎప్పుడు సిద్దమే అంటూ చెబుతుంది. అయితే 2013 లో వచ్చిన గీతాంజలి అనే మలయాళం మూవీ లో డీ గ్లామర్ పాత్రలోనే నటించానని, అలాంటి పాత్రలు చేయడం అంటే తనకి ఎంతో ఇష్టం అని చెప్పింది. ఒకేవేళ కనుక అలాంటి కథలని నాకోసం దర్శక, నిర్మాతలు తీసుకువస్తే పారితోషికంతో సంబంధం లేకుండా మరి నటిస్తానని చెబుతుంది. మరి తనకి బాగా నచ్చే అలాంటి డీ గ్లామర్ పాత్ర తనకి ఎప్పుడో దగ్గుతుందో చూడాలి.