ప్రేమ వివాహంపై ఆసక్తికర సమాధానం చెప్పిన కీర్తి సురేష్!

Advertisement

మహానటికి ముందు కీర్తి సురేష్ తమిళంలోనూ, తెలుగులోనూ విజయాలను అందుకుంది. అయితే సావిత్రిగా ఆమె నటనకు మాత్రం అందరూ ఫిదా అయిపోయారు. సినీ ప్రముఖులు సైతం ప్రశంసలు గుప్పిస్తున్నారు. ఈ సినిమా ఓవర్సీస్ లో 2 మిలియన్ డాలర్లను వసూలు చేసి దూసుకుపోతోంది. గత శుక్రవారం తమిళంలో “నడిగైయార్ తిలగం” అనే పేరుతో మహానటి విడుదలై మంచి స్పందన అందుకుంది. ఈ సందర్భంగా మీడియా ముందుకు వచ్చిన కీర్తి సురేష్ విలేఖరులు అడిగిన ప్రశ్నలపై స్పందించింది. సావిత్రిలా మంచినటిగా పేరు తెచ్చుకున్నారు.. ఆమె జీవితంలో జరిగిన విధంగానే ప్రేమ పెళ్లి, ఆపై సినిమాల నిర్మాణం, దర్శకత్వం వహిస్తారా? అని అడగగా.. దాటవేయకుండా స్పష్టంగా సమాధానం చెప్పింది.

“మా అమ్మ మేనక, బామ్మ సరోజ హీరోయిన్స్ గా రాణించారు. అలాగే నా సోదరి పార్వతి సైతం సినిమా రంగంలోనే ఉంది. నాన్న నిర్మాత. సో నేను నిర్మాతగా మారను. దర్శకత్వం చేసేందుకు అర్హత, ప్రతిభ నాకు ఉన్నాయని అనుకోవడం లేదు” అని వివరించింది. ఇక ప్రేమ వివాహం గురించి మాట్లాడుతూ.. “మా తల్లిదండ్రులది ప్రేమ వివాహమే. నేను ఇప్పుడే ప్రేమ పెళ్లి గురించి ఏమీ చెప్పలేను. ఇప్పట్లో నేను పెళ్లి చేసుకునే ఆలోచన లేదు. భవిష్యత్తులో నేను ఎవరినైనా ప్రేమిస్తే, వెంటనే తల్లిదండ్రులకు ధైర్యంగా చెప్పగలను. వారి అంగీకారంతోనే పెళ్లి చేసుకుంటాను” అని క్లారిటీ ఇచ్చింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus