మలయాళ బ్యూటీ కీర్తి సురేష్ తెలుగులో నేను శైలజ చిత్రం ద్వారా మంచి విజయాన్ని అందుకుంది. ఈ ఒక్క సినిమాతో అటు కోలీవుడ్, ఇటు టాలీవుడ్ నిర్మాతలను తన వైపు తిప్పుకుంది. నేను శైలజ కు 5 లక్షలు తీసుకున్న ఈ భామ, సినిమా హిట్ కావడంతో 20 లక్షలు డిమాండ్ చేస్తోంది. ఆమెకు యువతలో ఉన్న క్రేజ్ ను బట్టి అంతా మొత్తాన్ని ఇవ్వడానికి నిర్మాతలు వెనుకాడడం లేదు.
అయితే కీర్తి తెలుగు హీరోల కంటే తమిళ హీరోల సరసన నటించేందుకు మొగ్గు చూపిస్తోంది. విజయ్ పక్కన నటించడం కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రాన్ని వదులుకున్న ఈ సుందరి ప్రస్తుతం తమిళ చిత్రాల్లో బిజీగా ఉంది. ధనుష్ కి జోడీగా నటిస్తున్న కీర్తి, సూర్య సినిమాలో కథనాయికగా నటించేందుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సూర్య ‘సింగం 3’ తర్వాత ముత్తయ్య దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు.
ఈ సినిమా కోసం కీర్తి సురేష్ ను సంప్రదించగా ఆమె ఓకే చెప్పిందని సమాచారం. నేచురల్ స్టార్ నాని పక్కన నటించమని కోరితే ఆలోచిస్తానని చెప్పిన కీర్తి, సూర్య పక్కన అనగానే ఆలోచించకుండా ఓకే చెప్పేసిందట. ఈ నటికి తెలుగు లో కంటే తమిళంలోనే స్థిరపడాలనే ఆలోచన ఉందని ఫిలిం నగర్ వాసులు చెప్పుకుంటున్నారు.
https://www.youtube.com/watch?v=FI9MyRvyATw