రాజమౌళి కోసం బెస్ట్ ఫ్రెండ్ నానిని పక్కన పెట్టేసింది

  • November 24, 2018 / 11:12 AM IST

మహానటి ముందు వరకు కీర్తి సురేష్ రేంజ్ వేరు. ఆ సినిమా తరువాత వేరు. సక్సెస్ తో పాటు నటిగా ఆమెకు వచ్చిన గుర్తింపు అద్భుతం. ఆమె పేరు ప్రస్తావన కు వస్తే ముందు మహానటి అనే పలికే పరిస్థితి అని చెప్పుకోవచ్చు. కృష్ణార్జున యుద్ధం పరాజయం పాలవడం, ఆ పై దేవదాస్ కూడా ఆశించిన ఫలితం దక్కించుకోకపోవడం తో కాస్త డీలా పడ్డ నాని, ఇపుడు కొంచెం కొత్తగా ప్రయత్నిద్దాం అనే ఉద్దేశం తో క్రికెట్ నేపధ్యం తో జెర్సీ అనే సినిమాలో నటిస్తున్నాడు. దాంతో పాటు తన తోలి సినిమా అష్టా చమ్మా దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణ, మరియు చంద్రశేఖర్ యేలేటి సినిమాలకి కూడా ఒకే చెప్పాడట.

నేను లోకల్ లాంటి సూపర్ హిట్ సినిమా లో నాని-కీర్తి పెయిర్ కి మంచి ఆదరణే లభించింది. ఆ ఉద్దేశం తోనే తనని చంద్రశేఖర్ యేలేటి సినిమా లో హీరోయిన్ గా చేయమని అడిగితే దానికి ఆమె నో చెప్పిందని సమాచారం. అందుకు కారణం ఆమె రాజమౌళి-రామ్ చరణ్-జూనియర్ ఎన్టీఆర్ తో తెరకెక్కిస్తున్న భారీ మల్టీ స్టార్రర్ లో హీరోయిన్ గా ఎంపిక అవడమే అని అందుకే వేరే ఏ సినిమా కి తాను డేట్స్ ఇవ్వడం లేదాని అంటున్నారు. ఏదేమైనా అఫిషియల్ గా ప్రకటించే వరకు ఇలాంటి రూమర్స్ వినిపించడం సినీ ఇండస్ట్రీ లో సహజమే.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus