ఒకవేళ ఎవరైనా అడిగితే ‘నో’ చెబుతా’- కీర్తి సురేష్‌

  • June 30, 2018 / 07:40 AM IST

కమర్షియల్ హీరోయిన్ గా రాణించాలంటే నటనలో భాగంగా కొన్ని పనులు చేయాల్సి ఉంటాయి. అవి బికినీ వేయడం.. లిప్ లాక్ లు ఇవ్వడం. వాటికి నో చెబితే… దర్శకనిర్మాతలు మరొకరికి ఎస్ చెబుతారు. అందుకే చాలామంది సై అంటుంటారు. కీర్తి సురేష్ మాత్రం ఈ పనులకు నై చెబుతున్నా అవకాశాలు మాత్రం ఆమె చుట్టూ తిరుగుతున్నాయి. నేను శైలజ, నేను లోకల్, అజ్ఞాతవాసి సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్న ఈ భామ మహానటితో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం విక్రమ్ తో సామి 2 (లక్ష్మీనరసింహ స్వామి సీక్వెల్), విశాల్ తో సండా కోజి 2 (పందెం కోడి సీక్వెల్), విజయ్ తో థళపతి 62 సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.

ఈ సందర్భంగా ఆమెను లిప్ లాక్ సన్నివేశాల్లో నటిస్తారా? అని అడిగితే… ‘‘నేను అలాంటి సన్నివేశాల్లో నటించలేను. ఎందుకంటే నాకు నిజంగానే బెరుకు ఎక్కువ. తెరపై రొమాన్స్‌ చేయాలంటే సిగ్గెక్కువ. అందుకే అలాంటి సన్నివేశాల్లో నటించలేను. నన్నెవరూ ముద్దు సన్నివేశాల్లో నటించమని అడగలేదు. నేను ఎంచుకునే కథలు కూడా అలాంటివే ఉంటున్నాయి. ఒకవేళ ఎవరైనా అడిగితే ‘నో’ చెబుతా” అని స్పష్టం చేసింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus