Anirudh: KHxRK జోనర్‌ చెప్పేసిన అనిరుధ్‌.. టీజర్‌ చూసి అలా అనుకుంటే..

47 ఏళ్ల కళను నెరవేరుస్తూ రజనీకాంత్‌, కమల్‌ హాసన్‌ను ఒకే ఫ్రేమ్‌లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌. ఈ కాంబినేషన్‌లో ఇటీవల సినిమా అనౌన్స్‌ అయిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఓ స్పెషల్ వీడియోను కూడా రిలీజ్‌ చేశారు. ఆ వీడియోలో ఇద్దరు స్టార్‌లతోపాటు దర్శకుడు నెల్సన్‌, సంగీత దర్శకుడు అనిరుథ్‌ కూడా కనిపించారు. ఇద్దరు హీరోలు కలసి నటిస్తున్నారు.. దర్శకుడు ఈయన, సంగీత దర్శకుడు ఈయన అని మాత్రమే వీడియోలో చెప్పారు. సినిమా ఎలా ఉంటుంది అనేది చెప్పలేదు.

Anirudh

ఆ వీడియోలో ఇద్దరు హీరోలు కాస్త సీరియస్‌గా ఉండటం, ‘హీరో ఎవరు?’ అనే ప్రశ్న వేసి కన్‌ఫ్యూజ్‌ చేసి వదిలేయడం చూశాం. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ విషయాన్ని రివీల్‌ చేశారు అనిరుధ్‌. ఇటీవల మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం చెప్పుకొచ్చారు. ఈ సినిమా పూర్తి స్థాయి వినోదభరితంగా ఉంటుంది అని చెప్పుకొచ్చారు. అంతేకాదు వీడియోలో చూపించినట్లుగా సినిమా కథ 1970ల నేపథ్యంలోనిది కాదట. ప్రమోషనల్‌ వీడియో కోసం అలా చేశారట.

మ్యూజిక్‌ కొత్తగా ఉండాలని 70ల కాలం నాటి రెట్రో మ్యూజిన్‌కి వాడామని అనిరుథ్‌ తెలిపారు. తన వయసు కంటే అనుభవం ఎక్కువ ఉన్న హీరోలతో కలసి పని చేయడం మరపురాని అనుభూతి అని చెప్పుకొచ్చారాయన. ఇక ఈ సినిమా చిత్రీకరణ వచ్చే ఏడాది ప్రారంభమవుతుందని చెప్పారు. ప్రస్తుతం కమల్‌, రజనీ చేస్తున్న సినిమాల పనులు అన్నీ అయిపోయాక ఈ సినిమా మొదలుపెడతారట. రజనీకాంత్‌ 173వ సినిమా చిత్రీకరణ త్వరలో మొదలవుతుంది. ఇక కమల్ హాసన్‌ చేతిలో ‘కల్కి 2’ ఉంది. ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో ఇటీవల మొదలైంది. అలాగే అన్బరివ్‌ ద్వయం దర్శకత్వంలో ఓ సినిమాను ఇటీవల స్టార్ట్‌ చేశారు.

రకుల్‌ ప్రీత్‌కి చేదు అనుభవం.. విడ్డూరంగా ఇన్‌ఫ్లూయెన్సర్‌ మాటలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus