Khaleja Re-Release Collections: రీ- రిలీజ్లో కూడా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘ఖలేజా’!

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu)  కెరీర్లో ఓ అండర్ రేటెడ్ మూవీగా నిలిచింది ‘ఖలేజా'(Khaleja). 2010 అక్టోబర్ 7న రిలీజ్ అయిన ఈ సినిమా.. ఆ టైంలో బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించలేదు. త్రివిక్రమ్ (Trivikram) – మహేష్ బాబు ‘అతడు’ (Athadu) వంటి కల్ట్ మూవీ తర్వాత ఓ కొత్త పాయింట్ తీసుకుని ‘ఖలేజా’ చేశారు. 3 ఏళ్ళ గ్యాప్ తర్వాత మహేష్ బాబు నుండి వచ్చిన ఈ సినిమా ఆ టైంలో బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించలేదు.

Khaleja Collections:

ఆ విషయాన్ని నిర్మాత సి.కళ్యాణ్ (C Kalyan)  కూడా ఇటీవల చెప్పడం జరిగింది. అయితే టీవీల్లో బాగా చూశారు. దాదాపు 15 ఏళ్ళ తర్వాత ఈ సినిమాని రీ- రిలీజ్ చేశారు. మే 30 న ఈ చిత్రాన్ని రీ- రిలీజ్ చేయడం జరిగింది. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఏరియాల్లో ఈ సినిమా సూపర్ గా కలెక్ట్ చేసింది. ఒకసారి ‘ఖలేజా'(4K) ఫస్ట్ డే కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 3.25 cr
సీడెడ్ 0.35 cr
ఉత్తరాంధ్ర 0.40 cr
ఈస్ట్ 0.20 cr
వెస్ట్ 0.30 cr
గుంటూరు 0.32 cr
కృష్ణా 0.27 cr
నెల్లూరు 0.10 cr
ఏపీ+తెలంగాణ టోటల్ 5.19 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.45 cr
ఓవర్సీస్ 1.05 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 6.69 cr (షేర్)

కొత్త సినిమాల పోటీని తట్టుకుని మరీ ‘ఖలేజా'(4K) రీ- రిలీజ్ లో ఏకంగా రూ.6.69 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది. వీకెండ్ మొత్తం ఇదే విధంగా కలెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి.

డిసెంబర్ నెల పైనే ‘అఖండ 2’ కూడా కన్నేసిందా..!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus