“భరత్ అనే నేను”లో వసుమతిగా చాలా సాఫ్ట్ గా కనిపించి కనువిందు చేసిన కైరా అద్వానీ క్యూట్ అమ్మాయి అనే ఇమేజ్ ను సొంతం చేసుకొంది. అయితే.. చూడ్డానికి క్యూట్ గా ఉన్నా అమ్మడు బాలీవుడ్ లో చేసిన సినిమాలు అమ్మడికి హాట్ ఇమేజ్ ను తెచ్చిపెట్టాయి. అమ్మడు బాలీవుడ్ లో నటించిన “మెకానిక్” సినిమా చూస్తే అమ్మడి అందాల ఆరబోతకు ఎవరైనా దాసోహమనాల్సిందే. ప్రస్తుతం తెలుగు నుంచి వరుస అవకాశాలు వస్తున్నా.. వాటిని ఖాతరు చేయకుండా బాలీవుడ్ కే అగ్ర తాంబూలం ఇస్తున్న కైరా రీసెంట్ గా ప్రేమలో ఉన్నట్లు, అందుకే ముంబైకే పరిమితమైపోతున్నట్లు వార్తలొచ్చాయి.
బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో నటి కైరా అద్వాని ప్రేమలో ఉందనే వార్తలు ఈ మధ్య చక్కర్లు కొట్టాయి. అప్పట్లోనే ఆ వార్తలను ఖండించిన కైరా .. తన వ్యక్తిగత జీవితం గురించి రీసెంట్ గా మాట్లాడింది. `ప్రస్తుతానికి నా లైఫ్‌లో ప్రేమకు చోటు లేదు. కెరీర్‌తోనే చాలా బిజీగా ఉన్నా. అప్పుడెప్పుడో స్కూల్ డేస్‌లో ఒక అబ్బాయితో డేటింగ్ చేశాను. ప్రస్తుతానికి సింగిల్‌గానే ఉన్నానని కవర్ చేసింది. మరి ఈ కవరింగ్ ఎంతవరకూ వర్కవుట్ అవుతుందో చూడాలి.
వెంకీ మామ సినిమా రివ్యూ & రేటింగ్!
అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా రివ్యూ & రేటింగ్