వరుస విజయాలతో సూపర్ ఫామ్ లో ఉన్న హీరో పక్కన నటించడానికే పరాయి భాషా హీరోయిన్లు నానా హడావుడి చేస్తుంటారు. అలాంటి వరుస పరాజయాలతో కొట్టుమిట్టాడుతున్న హీరో పక్కన నటించమని అడిగితే వారి డిమాండ్లకు అడ్డు ఉండదు. ప్రస్తుతం రవితేజ పరిస్థితి అలాగే తయారయ్యింది. “రాజా ది గ్రేట్” తర్వాత ఒక్కటంటే ఒక్కటి కూడా సరైన విజయం లేని రవితేజ ప్రస్తుతం “క్రాక్” అనే సినిమాతోపాటు రమేష్ వర్మ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి సన్నద్ధమవుతున్నాడు.
రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కే సినిమా కోసం కీయారాను కథానాయికగా బాగుంటుందని సంప్రదించగా.. మరి ప్రొజెక్ట్ లో నటించడం ఇష్టం లేకనో, ఏదో ఒకలా తప్పించుకోవాలనుకుందో కానీ ఏకంగా రెండు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అడగడమే కాక కేవలం 20 రోజుల డేట్స్ ఎలాట్ చేస్తానని చెప్పిందట. దాంతో సైలెంట్ అయిపోయారు రమేష్ వర్మ & గ్యాంగ్. దాంతో తెలుగు హీరోయిన్నే ఫైనల్ చేద్దామని డిసైడ్ అయ్యారు.
Most Recommended Video
వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా రివ్యూ & రేటింగ్!
పవన్ కళ్యాణ్ రీమేక్ చేసిన 11 సినిమాల
ఒక చిన్న విరామం సినిమా రివ్యూ & రేటింగ్!