మహేష్ బాబు గురించి కైరా అద్వానీ ఏమి చెప్పిందంటే ?

  • March 20, 2018 / 09:21 AM IST

కొరటాల శివ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) చేస్తున్న “భరత్ అనే నేను” సినిమాపై రోజురోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి. ఫస్ట్ ఓత్, భరత్ విజన్ లు సినిమాపై ఆసక్తిని మరింత పెంచాయి. ముఖ్యమంత్రిగా మహేష్ నటిస్తున్న ఈ మూవీలో మహేష్ పంచెకట్టుతో ఎలా ఉంటారో ఉగాది నాడు ఓ పోస్టర్ రూపంలో చూపించారు. ఈ చిత్రం ద్వారా బాలీవుడ్ బ్యూటీ  కైరా అద్వానీ తెలుగు తెరకు పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే.  టాలీవుడ్ లో పనిచేయడం తనకి చాలా ఆనందాన్ని ఇచ్చిందని పలు మార్లు చెప్పింది. అలాగే తన తొలి తెలుగు హీరో మహేష్ గురించి ఎంతో గొప్పగా చెప్పింది. రీసెంట్ గా ఓ జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలు వెల్లడించింది.

“మహేష్ బాబుకి డెడికేషన్ చాలా ఎక్కువ ఆయన ఒకేరోజు ఐదు సన్నివేశాలను పూర్తి చేశారు. భరత్ అనే నేను షూటింగ్ అపుడు రెండు రోజులు లంచ్ కూడా చేయకుండా పని చేశారు. సెట్స్ లో ఎలాంటి కంప్లైంట్స్ ఉండవు” అని అభినందనలు కురిపించింది.  ప్రముఖ నిర్మాత డి.వి.వి. దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకి రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ చివరి షెడ్యూల్  కోసం చిత్ర బృందం మార్చి 25న స్పెయిన్ వెళ్లనున్నారు. భారీ అంచనాలు నెలకొని ఉన్న ఈ మూవీ ఏప్రిల్ 20న విడుదలకానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus