వైరల్ : కియారా అద్వానీ ఫెయిల్యూర్ లవ్ స్టోరి..!

  • October 22, 2020 / 03:10 PM IST

‘భరత్ అనే నేను’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది కియారా అద్వానీ. ఆ చిత్రం సూపర్ హిట్ అవ్వడంతో రాంచరణ్ – బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కిన ‘వినయ విధేయ రామ’ చిత్రంలో కూడా ఛాన్స్ దక్కించుకుంది. బాలీవుడ్‌లో అయితే ‘ఎం.ఎస్.ధోని’ ‘కభీర్ సింగ్’ వంటి చిత్రాలతో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ప్రస్తుతం అక్కడ ఈ అమ్మడు చేతినిండా సినిమాలతో బిజీగా గడుపుతుంది.ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ఈ అమ్మడు తన లవ్ స్టోరీని బయటపెట్టి అందరికీ షాకిచ్చింది.

ఇటీవల ఓ టీవీ షోలో పాల్గొన్న కియారా అద్వానీ మాట్లాడుతూ… ‘ప్రతీ ఒక్కరి జీవితంలో ఫస్ట్ లవ్ అనేది చాలా స్పెషల్.దాని జ్ఞాపకాలు ప్రతి ఒక్కరి హృదయంలో భద్రంగా ఉంటాయి.మనకు తెలియకుండానే ఎన్నోసార్లు వాటిని నెమరువేసుకుని మురిసిపోతూ ఉంటాము.అది ఫెయిల్ అయినప్పటికీ ఆ జ్ఞాపకాలు మనల్ని ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటాయి. ‘ప్లస్‌ టూ’ చదువుతున్న రోజుల్లో నేను కూడా ఓ అబ్బాయిని చాలా ఇష్టపడ్డాను.హాలిడేస్ అయినప్పటికీ ఇంట్లో ఏదో ఒక అబద్ధం చెప్పి అతన్ని మీట్ అయ్యే దాన్ని.

ఆ సమయంలో చదువును అశ్రద్ధ చేస్తున్నానంటూ మా పేరెంట్స్ కోప్పడేవారు. దాంతో ఈ లవ్ వంటివి అప్పుడే ఎందుకులే అని కాంప్రమైజ్ అయ్యి దానికి ఫుల్స్టాప్ పెట్టాను. ఆ టైములో నేను చాలా భావోద్వేగానికి గురయ్యాను. అయితే ఏజ్ పెరిగేకొద్దీ మెచ్యూరిటీ రావడంతో అతన్ని మర్చిపోయాను’ అంటూ చెప్పుకొచ్చింది కియారా.

Most Recommended Video

టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!
బిగ్‌బాస్‌ ‘రౌడీ బేబీ’ దేత్తడి హారిక గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus