మరో హాట్ క్యారెక్టర్ సైన్ చేసిన కియారా అద్వానీ

  • May 29, 2019 / 07:03 PM IST

“భరత్ అనే నేను”లో వసుమతిగా చాలా సాఫ్ట్ గా కనిపించి కనువిందు చేసిన కైరా అద్వానీ క్యూట్ అమ్మాయి అనే ఇమేజ్ ను సొంతం చేసుకొంది. అయితే.. చూడ్డానికి క్యూట్ గా ఉన్నా అమ్మడు బాలీవుడ్ లో చేసిన సినిమాలు అమ్మడికి హాట్ ఇమేజ్ ను తెచ్చిపెట్టాయి. అమ్మడు బాలీవుడ్ లో నటించిన “మెకానిక్” సినిమా చూస్తే అమ్మడి అందాల ఆరబోతకు ఎవరైనా దాసోహమనాల్సిందే. ప్రస్తుతం తెలుగులో వరుస అవకాశాలు దక్కించుకొంటూ ఇక్కడ సెటిల్ అవ్వడానికి ప్రయత్నిస్తోంది. ఆమె బాలీవుడ్ లో చేసిన “లస్ట్ స్టోరీస్” సిరీస్ ఆమెకు విశేషమైన పేరు సంపాదించి పెట్టింది.

ఇప్పుడు మళ్ళీ అదే తరహా హాట్ క్యారెక్టర్ ను ఒకే చేసిందట కీయారా. “ఇందూ కి జవానీ” అనే పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రంలో కీయారా ఆరుగురు యువకులతో శృంగార సన్నివేశాల్లో పాల్గొననుందని సమాచారం. కీయారా ఇలా బోల్డ్ & క్యూట్ రోల్స్ చేస్తూ కెరీర్ ను బాగానే ప్లాన్ చేసుకుంది. చూస్తుంటే.. నెక్స్ట్ స్టార్ హీరోయిన్ ఆమే అని ఫిక్స్ అవ్వడంలో తప్పు లేదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus