బాలీవుడ్ లవ్ కపూల్ సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. రాజస్థాన్‌లోని సూర్యగఢ్ ప్యాలస్‌లో మంగళవారం సాయంత్రం కియారా, సిద్ధార్థ్‌ల వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఎంతో రహస్యంగా వీరి పెళ్లి జరిగింది. కియారా అద్వానీ ట్విట్టర్ ద్వారా తమ పెళ్లి ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. ‘ఇప్పుడు మా పర్మినెంట్ బుకింగ్ పూర్తయ్యింది’ అని ఫొటోలకు కియారా అద్వానీ క్యాప్షన్ పెట్టారు.
అలాగే, కొత్త జీవితం ప్రారంభించబోతున్న తమకు మీ అందరి ఆశీస్సులు, ప్రేమ ఉండాలని కోరుకుంటున్నానని కియారా పేర్కొన్నారు. ఇద్దరి జంట చూడముచ్చటగా ఉంది. ఇక అభిమానులతో పాటు సినీ ప్రముఖులు సైతం వీరికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ పెళ్లి ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :
1
2
3
4