రవితేజ హీరోగా ఇలియానా హీరోయిన్ గా సురేంద్ర రెడ్డి డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రం ‘కిక్’. నిర్మాత ఆర్.ఆర్.వెంకట్ తన ఆర్.ఆర్.మూవీ మేకర్స్ పతాకం పై ఈ చిత్రాన్ని నిర్మించారు.2009 మే 8 న ఈ చిత్రం విడుదల అయ్యింది. అంటే ఈరోజుతో 12ఏళ్ళు పూర్తి కావస్తోంది అన్న మాట.అందుకే సోషల్ మీడియాలో ‘#14YearsForKick’ హ్యాష్ ట్యాగ్ లు తెగ ట్రెండ్ అవుతున్నాయి.
రవితేజ మార్కెట్ ను రెండింతల వరకూ పెంచిన చిత్రమిది. మరి ఫుల్ రన్ లో ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం రండి :
నైజాం | 7.53 cr |
సీడెడ్ | 2.72 cr |
ఉత్తరాంధ్ర | 3.12 cr |
ఈస్ట్ | 0.94 cr |
వెస్ట్ | 0.92 cr |
గుంటూరు | 1.7 cr |
కృష్ణా | 1.03 cr |
నెల్లూరు | 0.84 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 18.89 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 3.86 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 22.75 cr |
‘కిక్’ చిత్రానికి రూ.13.77 కోట్ల ధియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఫుల్ రన్ ముగిసే సరికి ఈ చిత్రం రూ.22.75 కోట్ల షేర్ ను రాబట్టింది. అంటే బయ్యర్లకు 8.95 కోట్ల లాభాలు దక్కినట్టు తెలుస్తుంది. ఆ ఏడాది విడుదలైన సినిమాల్లో మగధీర, అరుందతి ల తరువాత అత్యధిక లాభాలను మిగిల్చిన మూవీగా కిక్ నిలిచింది.
Most Recommended Video