KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • దీక్షిత్ శెట్టి, శశి ఓదెల (Hero)
  • యుక్తి తరేజా (Heroine)
  • మురళీధర్ గౌడ్, అంకుర్ వికాల్, పృథ్వీ రాజ్, జాకీ,సురేఖా వాణి తదితరులు (Cast)
  • కిరణ్ కుమార్ మీనుగ (Director)
  • పూర్ణచంద్ర తేజస్వి (Producer)
  • సుధాకర్ చెరుకూరి (Music)
  • నగేష్ బానెల్ (Cinematography)
  • శ్రవణ్ కటికనేని (Editor)
  • Release Date : 7th ఆగ‌స్ట్‌ 2026
  • ఎస్ ఎల్ వి సినిమాస్ (Banner)

గతంలో అక్కినేని నాగార్జున హీరోగా నటించిన ‘కేడి’ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు కిరణ్ కుమార్ మీనుగ అలియాస్ కెకె. ఆ సినిమాతో కొత్త ప్రయత్నం అయితే చేశాడు కానీ అది బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. తర్వాత ఆల్మోస్ట్ 15 ఏళ్ళ గ్యాప్ తర్వాత ‘KJQ‘(కింగ్ జాకీ క్వీన్) అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. కానీ దురదృష్టవశాత్తు ఈ సినిమా రిలీజ్ కాకుండానే ఆయన అనారోగ్యంతో మరణించడం జరిగింది. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో సినిమాని పక్కన పెట్టేస్తారు నిర్మాతలు. కానీ నిర్మాత సుధాకర్ చెరుకూరి మాత్రం ఎంతో నమ్మకంతో రిలీజ్ చేయడానికి డిసైడ్ అవ్వడం అనేది అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘KJQ’ ప్రేక్షకులను ఏ మేర మెప్పించిందో తెలుసుకుందాం రండి :

KJQ Movie Review

కథ: పార్థ (దీక్షిత్ శెట్టి) ఒక అనాథ. అతన్ని చిచ్చా (మురళీధర్ గౌడ్) అనే పెద్దాయన చేరదీసి పెంచుతాడు. చిన్నతనంలో పార్థ కష్టపడి పనిచేద్దామనుకునే మనస్తత్వం కలిగిన పిల్లాడే. కానీ అతని అమాయకత్వాన్ని అవకాశంగా తీసుకుని కొందరు పోలీసులు అతనిపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తూ ఉంటారు. దాంతో సహనం కోల్పోయిన పార్థ ఒక పోలీస్‌ను హత్య చేస్తాడు. ఆ పోలీస్ పై-అధికారి ఎవరైతే ఉన్నాడో అతన్ని జాకీ (శశి ఓదెల) తప్పనిసరి పరిస్థితుల్లో హత్య చేస్తాడు. ఈ క్రమంలో జాకీ జైలు పాలు కాకుండా కాపాడతాడు పార్థ. అక్కడి నుండీ పార్థ ఏది చెప్పినా కాదనకుండా చేస్తుంటాడు జాకీ.

ఇందులో భాగంగా పార్థకి అడ్డువచ్చిన ప్రతి ఒక్కరినీ జాకీ హతమారుస్తూ ఉంటాడు.క్రమ క్రమంగా పార్థ ఒక పెద్ద గ్యాంగ్‌స్టర్‌గా ఎదిగి సిటీని తన కంట్రోల్‌లోకి తీసుకుంటాడు. అయితే అధికారం అనే మోజులో పడి, అహం తలకెక్కించుకుని తానొక మనిషిని అనే సంగతే మర్చిపోతాడు. మరోవైపు పార్థ కోసం హత్యలు చేస్తున్న సమయంలో, తాను ప్రేమించిన అమ్మాయిని తన చేతులతోనే చంపుకుంటాడు జాకీ. ఇలా సాగుతున్న వీరి జీవితంలోకి భార్గవి (యుక్తి తరేజా) అనే అమ్మాయి ఎంట్రీ ఇస్తుంది. ఆమె రాకతో పార్థ, జాకీల జీవితాలు ఏ మలుపు తిరిగాయి? అనేది మిగిలిన కథ.

నటీనటుల పనితీరు: ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమా చూశాక దీక్షిత్ శెట్టిని కొట్టాలనిపించింది’ అని ఆ టైంలో చాలా మంది అమ్మాయిలు కామెంట్లు చేయడం చూశాం. ఈ ‘KJQ’ లో కూడా ఆల్మోస్ట్ ఆ రేంజ్ పెర్ఫార్మన్సే ఇచ్చాడు దీక్షిత్. ముఖ్యంగా క్లైమాక్స్ లో అతని నటన చూసి ఫిదా అవ్వని వారంటూ ఉండరు అంటే అతిశయోక్తి అనిపించుకోదు. శ్రీకాంత్ ఓదెల తమ్ముడు అయినటువంటి శశి ఓదెల కూడా బాగా చేశాడు. యాక్షన్ సీన్స్ లో చాలా యాక్టివ్ గా పెర్ఫార్మ్ చేశాడు. కచ్చితంగా ఇతను ప్లేసెస్ కి వెళ్తాడు అనడంలో సందేహం లేదు. యుక్తి తరేజా గ్లామర్ షో కొంచెం హద్దులు దాటిన ఫీలింగ్ కలిగిస్తుంది. ఈ పాత్రలో చాలా ఎమోషన్ దాగున్నప్పటికీ..ఆడియన్స్ ఆ ఎమోషన్ తో కనెక్ట్ అవ్వలేరు. కానీ యుక్తి పెర్ఫార్మన్స్ వీక్ గా ఉండటం వల్లనే..! మురళీధర్ గౌడ్ నటన బాగుంది. సురేఖ వాణి, 30 ఇయర్స్ పృథ్వీ..ల పాత్రలు కేమియోల మాదిరి ఉన్నాయి.

సాంకేతిక నిపుణుల పనితీరు: దర్శకుడు కిరణ్ కుమార్ అలియాస్ కెకె మరో డిఫరెంట్ పాయింట్ తీసుకున్నాడు. తాను ఎంపిక చేసుకున్న పాయింట్ లో చాలా డెప్త్ ఉంది. దావుద్ ఇబ్రహీం, బాలసుబ్రహ్మణ్యం, బ్రహ్మానందం వంటి లెజెండ్స్… పుట్టినప్పుడు సాధారణమైన వారే. కానీ పరిస్థితులు ఒకరిని గొప్పవారిగా చేస్తే.. ఇంకొకరిని క్రిమినల్ ని చేశాయి అంటూ ఓ ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పి సినిమాని స్టార్ట్ చేశాడు. ఆ లైన్ కి తగినట్టే.. ఈ సినిమాలో పాత్రలు ఉంటాయి. సమాజం వల్ల చెడిపోయిన వాడిగా కింగ్(పార్థ) పాత్రని చూపించారు. పరిస్థితుల వల్ల చెడిపోయినట్టు జాకీ పాత్రని చూపించారు. ప్రేమ,నమ్మకం వంటి వాటి వల్ల మోసపోయినట్టు క్వీన్ పాత్ర ఉంటుంది.

కానీ ఈ పాత్రల మధ్య కనెక్టివిటీ కోసం రాసుకున్న సన్నివేశాలు రక్తికట్టలేదు. ఫస్ట్ హాఫ్ ఓకే. అలా వెళ్ళిపోతుంది. ఎక్సయిట్ చేసే రేంజ్లో కాకపోయినా పర్వాలేదు ఎంగేజ్ చేస్తుంది. కానీ సెకండాఫ్..ని ఎలా డీల్ చేయాలో తెలీక హడావిడిగా ముగించినట్టు అనిపిస్తుంది. క్లైమాక్స్ ఇంకా బాగా తీయొచ్చు. అక్కడ రైటింగ్ వీక్ అయిపోయింది. ప్రోపర్ కన్క్లూజన్ లేకుండానే సినిమా ముగిసిన ఫీలింగ్ కలుగుతుంది. టెక్నికల్ గా హై-స్టాండర్డ్స్ లో తీశారు. విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, యాక్షన్ సీక్వెన్స్..లు బాగున్నాయి. నిర్మాత ఎక్కడా ఖర్చుకి వెనుకాడలేదు. రన్ టైం 2 గంటలే అయినప్పటికీ.. చాలా సేపు థియేటర్లలో కూర్చున్న ఫీలింగ్ కలిగిస్తుంది.

విశ్లేషణ: ‘KJQ’ సినిమా ఇంట్రెస్టింగ్ గా మొదలైంది. అహం, స్నేహం, ప్రేమ వంటి వాటికి కూడా లిమిట్ అనేది ఉండాలి. లేదు అంటే.. ప్రతికూల పరిస్థితుల్లో వాటి వల్ల చాలా డ్యామేజ్ జరుగుతుంది అని దర్శకుడు తన కోణంలో చెప్పే ప్రయత్నం చేశాడు. రైటింగ్ లోపాలు పక్కన పెడితే.. దర్శకుడు కెకె గతంలో తీసిన ‘కేడి’ కంటే కూడా ఇది బెటర్ గానే ఉంది.

ఫోకస్ పాయింట్: నాట్ ఎ బ్యాడ్ అటెంప్ట్

రేటింగ్: 2.25/5

Rating

2.25
Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus