జనతా గ్యారేజ్ డైరక్టర్ కు స్పెషల్ గిఫ్ట్!

  • September 24, 2016 / 07:09 AM IST

జనతా గ్యారేజ్ టాలీవుడ్ రికార్డులను తిరగరాస్తుండడంతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ చాలా సంతోషంగా ఉన్నారు. తనకి పదమూడేళ్ల తర్వాత భారీ హిట్ ఇచ్చిన డైరక్టర్ కి కానుక ఇవ్వాలని తారక్ డిసైడ్ అయ్యారు. కొరటాల శివకు ఒక అందమైన డూప్లెక్స్ ఇంటిని ఇవ్వడానికి సిద్ధమయ్యారు. దీని విలువ కోట్లలో ఉంటుందని సమాచారం.

గతంలో శ్రీమంతుడు వంటి భారీ హిట్ లభించడంతో మహేష్ ఆనందంతో కొరటాల శివకు యాభై లక్షల విలువ గల ఆడి కారుని గిఫ్ట్ గా ఇచ్చారు. ఇప్పుడు ఎన్టీఆర్ అంతకు మించి ఖరీదైన ఇంటిని బహుకరించనున్నారు. ప్రస్తుతం మహేష్ సినిమా కోసం స్క్రిప్ట్ వర్క్ లో బిజీగా ఉన్న కొరటాల.. తారక్ నిర్ణయం తో ఆనంద పడ్డారు. ఆ కానుక తన కష్టానికి ఒక అభినందన లాంటిదని కొరటాల భావిస్తున్నట్లు అయన సన్నిహితులు చెప్పారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus