నాని కి కథ వినిపించిన కొరటాల శివ

  • March 17, 2018 / 06:43 AM IST

అపజయం ఎరుగని డైరక్టర్ కొరటాల శివ. వరుసగా విజయాలు అందుకుంటున్న హీరో నాని. వీరిద్దరూ కలిస్తే మూవీ సూపర్ హిట్. అందుకే వీరి కలయికలో సినిమాకి రంగం సిద్ధమవుతోంది. ప్రస్తుతం కొరటాల శివ మహేష్ బాబు తో భరత్ అనే నేను సినిమా చేస్తున్నారు. ఈ మూవీ తరవాత రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో సినిమా తీయాలని అనుకున్నారు. అయితే వారిద్దరి డేట్స్ ఏడాది దాకా లాక్ అయిపోయాయి. సో కొరటాల నాని కోసం ఓ కథ రాసారని … రీసెంట్ గా వినిపించారని, అందుకు నాని కూడా ఒకే చెప్పినట్లు ఫిలిం నగర్ వాసులు చెప్పారు. ప్రస్తుతం నాని యువ దర్శకుడు మేర్లపాక గాంధీ దర్శకత్వంలో “కృష్ణార్జున యుద్ధం” సినిమా చేస్తున్నారు.

నాని ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ చిత్రం ఏప్రిల్ 12 న థియేటర్లోకి రానుంది. ఈ మూవీ రిలీజ్ కాకముందే నాగార్జునతో కలిసి మల్టీ స్టారర్ మూవీ చేస్తున్నారు. “భలే మంచిరోజు”, “శమంతకమణి” సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న డైరక్టర్ శ్రీరామ్ ఆదిత్య ఈ సినిమాని తెరకెక్కించనున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ నిర్మిస్తున్న ఈ సినిమా ఉగాది నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. ఈ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో నాని నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus