Koratala Siva: అబ్బాయ్ మాత్రమే కాదు బాబాయ్ కూడా వెయిటింగ్లో పెట్టాడు

కొరటాల శివ(Koratala Siva) ఒకప్పుడు బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొట్టిన దర్శకుడే. ‘మిర్చి’ ‘శ్రీమంతుడు’ ‘జనతా గ్యారేజ్’ ‘భరత్ అనే నేను’ వంటి సినిమాలతో హిట్లు కొట్టడమే కాదు.. మార్కెట్ ను.. మర్యాదని కూడా పెంచుకున్నాడు కొరటాల శివ. కానీ చిరంజీవి- చరణ్..లతో చేసిన ‘ఆచార్య’ సినిమా కొరటాల ఇమేజ్ ని చాలా డ్యామేజ్ చేసింది. తర్వాత ఎన్‌టి‌ఆర్ తో ‘దేవర’ వంటి కమర్షియల్ సక్సెస్ అందుకున్నా.. కంటెంట్ పై విమర్శలు ఎదుర్కొన్నాడు.

Koratala Siva

ఎన్‌టి‌ఆర్ అభిమానులు సైతం ఆ సినిమా రిజల్ట్ తో సంతృప్తి చెందలేకపోయారు అనే చెప్పాలి.’దేవర 2′ కూడా అనౌన్స్ చేసినప్పటికీ, ఎన్‌టి‌ఆర్ కూడా హామీ ఇచ్చినప్పటికీ.. ఇప్పట్లో అది సెట్స్ పైకి వెళ్ళడం అనుమానంగానే ఉంది.

అందుకే కొరటాల శివ కూడా నెక్స్ట్ ఆప్షన్ కోసం చూస్తున్నాడు. సోషల్ మెసేజ్ తో కూడుకున్న కమర్షియల్ సినిమాలు కొరటాల శివకి మంచి పేరు తీసుకొచ్చాయి. కానీ మధ్యలో పాధఘట్టం, ఎర్రసముద్రం అంటూ బ్యాలెన్స్ తప్పాడు. పాన్ ఇండియా మోజులో ఇరుక్కోవడం వల్ల కొరటాల శివలో వచ్చిన మార్పులు అవి అనుకోవచ్చు. అందుకే ఇప్పుడు తన తప్పు తెలుసుకుని మళ్ళీ.. తన పంధాలోకి వచ్చాడు.

పవన్ కళ్యాణ్ కోసం ఓ సోషల్ మెసేజ్ తో కూడిన మాస్ కథని డిజైన్ చేసుకున్నాడు. అయితే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఒక సినిమా కంప్లీట్ చేయడమే చాలా కష్టం. ఆల్రెడీ సురేందర్ రెడ్డి సినిమాకి కమిట్ అవ్వడంతో కొరటాలకి యెస్ చెప్పలేదు. దీంతో అదే కథతో బాలయ్యని అప్రోచ్ అయ్యాడు. ‘సింహా’ నాటి పరిచయం. పైగా బాలయ్యకి కథ నచ్చింది. కాకపోతే బాలయ్య కూడా ఇప్పుడు వరుస కమిట్మెంట్స్ తో బిజీగా ఉన్నాడు.ఇలా అబ్బాయ్ ఎన్‌టి‌ఆర్ తో పాటు బాబాయ్  బాలయ్య కూడా కొరటాల శివని వెయిటింగ్లో పెట్టాడని చెప్పొచ్చు.

డిస్ట్రిబ్యూషన్లో కూడా రాజు గారు వీకైపోయినట్టేనా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus