మణికర్ణిక సినిమాని క్రిష్ 90% తీసిన తర్వాత సినిమా నుంచి తప్పుకోగా.. అనంతరం అతడి స్థానాన్ని కంగనా రీప్లే చేసి సినిమాను పూర్తి చేసింది. సోనూ సూద్ క్యారక్టర్ విషయంలో కంగనకి, క్రిష్‌కి గొడవ అయిందట. ఆ విషయాన్ని క్రిష్ ఇపుడు బాలీవుడ్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూల్లో బయటపెట్టాడు. సోను పోషించిన సదాశివరావు పాత్ర ఝాన్సీ లక్ష్మీబాయ్ జీవితంలో కీలకమైన పాత్ర. కానీ ఆ పాత్రని ముందే చంపేయమని కంగనా కోరింది. అలా చేస్తే చరిత్రను వక్రీకరించడమే అవుతుంది, నేను షూట్ చేయనని చెప్పాను. ఆ తర్వాత కొన్ని రోజులకి.. నా పనితనం జీ స్టూడియోస్‌కు నచ్చలేదని కంగన నన్ను నమ్మించింది. ఓ భోజ్‌పూరి సినిమాలా తీశానని నిర్మాతలన్నట్లు ఆమె నాతో చెప్పారు.
కొన్ని రోజులకి ఇక కంగన డెరెక్ట్ చేస్తుందని కమల్ జైన్ చెప్పారు. దాంతో నేను తప్పుకున్నాను అని క్రిష్ బాలీవుడ్ మీడియాకి చెప్పాడు. ఇప్పుడు దర్శకత్వం క్రెడిట్ ఆమె తీసుకోవడం తనకు ఏమాత్రం నచ్చలేదని క్రిష్ డైరెక్ట్ ఎటాక్ మొదలెట్టాడు. ఈ విషయం కంగనా పెద్దగా స్పండించకపోయినప్పటికీ.. ఆమె సోదరి రంగోలీ మాత్రం కాస్త ఘాటుగానే స్పందించింది. బాబూ సరే …సినిమా అంతా మీరే తీశారని ఒప్పుకుంటున్నాం. ఇక శాంతించు. కంగన ఫేస్ వల్లే సినిమా ఆడుతుందనేది వాస్తవం కదా. ఆమెని అలా వదిలెయ్యి. ఆమె సక్సెస్‌ని ఎంజాయ్ చేయనివ్వు. ఇక మీ పని మీరు చూసుకొండి, అంటూ ట్వీటేసి ఇన్‌డైరక్ట్‌గా భారీ సెటైర్ వేసింది కంగనా సోదరి. మరి ఈ విషయమై క్రిష్ మళ్ళీ ఏమైనా స్పందిస్తాడో లేదో చూడాలి.