అల్లు అర్జున్ ని అవమానించిన బాలీవుడ్ క్రిటిక్

  • July 4, 2017 / 11:19 AM IST

సెలబ్రిటీలపై వివాదాస్మద కామెంట్లు చేసి వార్తల్లో నిలుస్తున్న బాలీవుడ్ ఫిలిం క్రిటిక్ కమల్ ఆర్ ఖాన్ ఈ సారి అల్లు అర్జున్ ని టార్గెట్ చేసాడు. తన మాటలతో ఘోరంగా అవమానించాడు. గతంలో బాలీవుడ్ కంక్లూజన్ చెత్త సినిమా అని రివ్యూ రాసాడు. ఒంటె లాంటి ప్రభాస్ ని బాలీవుడ్ నిర్మాతలు తీసుకుంటే వారంతా ఇడియట్స్ అని సంచలన కామెంట్స్ చేసాడు. ఆ తర్వాత బాహుబలి అభిమానుల నుంచి వ్యతిరేకత రావడంతో “బాహుబలి 2 నాకు మాత్రమే నచ్చలేదు.. అందరికీ నచ్చింది” అంటూ వివరణ ఇచ్చుకున్నాడు. ఆ గుణపాఠం అతనికి బుద్ధి తీసుకురాలేకపోయింది. మళ్ళీ టాలీవుడ్ హీరోపై కామెంట్లు చేసాడు.

“ఆలూ ప్రస్తుతం పెద్ద స్టార్ అని కొంతమంది నాకు చెబుతున్నారు. బ్రదర్.. నీకు చిన్న పాత్రలు కావాలంటే బాలీవుడ్ కి రా” అని అల్లు అర్జున్ ఫోటో షేర్ చేస్తూ కమల్ ఆర్ ఖాన్ హేళన చేసాడు.  దీంతో అల్లు అర్జున్ అభిమానులు అతనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు నటులపై ఇష్టప్రకారం కామెంట్స్ చేస్తున్న కమల్ పై తెలుగు సినీ పరిశ్రమ పెద్దలు సీరియస్ గా ఉన్నారు. పర్సనల్ గా కలిసి హెచ్చరించాలని చూస్తున్నారు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus