ప్రగతి భవన్ లోకి పవన్ కళ్యాణ్ కి ఎంట్రీ ఇవ్వని కె.సి.ఆర్ & కె.టి.ఆర్

“ధృవ” ఆడియో ఫంక్షన్ లో తెలంగాణ ప్రజల సాక్షిగా రామ్ చరణ్ ను ఉద్దేశించి “బాబాయ్ పవర్ స్టార్” అని పవన్ కళ్యాణ్ ఇమేజ్ ను ఆకాశానికెత్తేసిన కె.టి.ఆర్ నేడు పవన్ కళ్యాణ్ కు ముఖం చాటేయడం చర్చనీయాంశం అయ్యింది. తెలంగాణలోని ఆర్టీసీ సమస్యలను చర్చించడానికి పవన్ కళ్యాణ్ పర్సనల్ గా కె.టి.ఆర్ ను కానీ కె.సి.ఆర్ ను కానీ కలవాలి అనుకొన్నారు. ఈమేరకు అప్పాయింట్మెంట్ కోసం అర్జీ పెట్టుకోగా ప్రగతి భవన్ నుంచి కనీస స్థాయి రెస్పాన్స్ రాలేదు.

తెలంగాణలో పర్యటిస్తూ పవన్ కళ్యాణ్ ఒకసారి “కె.సి.ఆర్ నీ తాట తీస్తా” అని అనడమే ఇందుకు కారణం అని చెప్పుకొంటున్నారు. అయితే.. అనంతరం పలుమార్లు పవన్ కళ్యాణ్ తెలంగాణ ముఖ్యమంత్రి కె.సి.ఆర్ ను పొగిడారు. తెలంగాణ ఉద్యమ వీరుడు అని కూడా పలుమార్లు పేర్కొన్నారు. అలాంటి పవన్ కళ్యాణ్ కు కనీసం కలవడానికి కూడా పర్మిషన్ లభించకపోవడం పట్ల పవన్ ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు.

మీకు మాత్రమే చెప్తా సినిమా రివ్యూ & రేటింగ్!
విజిల్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఖైదీ సినిమా రివ్యూ & రేటింగ్!.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus