Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

‘లవ్ స్టోరీ’ (Love Story) తర్వాత శేఖర్ కమ్ముల (Sekhar Kammula) దర్శకత్వంలో తెరకెక్కిన ‘కుబేర’ (Kuberaa) చిత్రం జూన్ 20న రిలీజ్ అయ్యింది. ధనుష్ (Dhanush) హీరోగా నటించిన ఈ సినిమాలో అక్కినేని నాగార్జున (Nagarjuna) దీపక్ అనే అత్యంత కీలక పాత్ర పోషించారు. ధనుష్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇస్తే.. నాగార్జున కూడా సెటిల్డ్ గా పెర్ఫార్మ్ చేసి అదరగొట్టారు.

Kuberaa Collections:

‘ఏషియన్ సినిమాస్’ ‘అమిగోస్ క్రియేషన్స్’ సంస్థలపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్, శేఖర్ కమ్ముల (Sekhar Kammula) సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. సినిమాకి మొదటి షోతోనే పాజిటివ్ టాక్ రావడంతో.. ఓపెనింగ్స్ కూడా బాగా వచ్చాయి. వీకెండ్ మొత్తం బ్రహ్మాండంగా కలెక్ట్ చేసిన ఈ సినిమా 4వ రోజు డౌన్ అయ్యింది. ఒకసారి 4 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే:

నైజాం 9.87 cr
సీడెడ్ 2.9 cr
ఉత్తరాంధ్ర 3.51 cr
ఈస్ట్ 1.75 cr
వెస్ట్  1.11 cr
గుంటూరు 1.55 cr
కృష్ణా 1.61 cr
నెల్లూరు 0.86 cr
ఏపీ+తెలంగాణ 23.16 cr (షేర్)
తమిళనాడు 7.5 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా  4.55 cr
ఓవర్సీస్ 13.85 cr
వరల్డ్ టోటల్ 49.06 cr (షేర్)

‘కుబేర’ (Kuberaa) చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.58.9 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే రూ.60 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. 4 రోజుల్లో ఈ సినిమా రూ.49.06 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.78.70 కోట్లు కొల్లగొట్టింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.10.94 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.

తిరుమలలో శ్రీవారి సన్నిధిలో కె.వి.ఎన్ ప్రొడక్షన్స్ నిర్మాత ఎన్.కె.లోహిత్ దర్శనం!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus