ఆ యువహీరో ప్రేమలో లావణ్య..?

  • August 4, 2016 / 10:37 AM IST

లావణ్య త్రిపాఠి ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కొంతకాలానికే స్టార్ హీరోల సరసన అవకాశాలు సంపాదిస్తోంది. నాగార్జున వంటి సీనియర్ హీరోలతో నటిస్తూనే నాని, అల్లు శిరీష్ వంటి యువ హీరోలతోనూ నటిస్తోంది. ప్రస్తుతం లావణ్య నటించిన ‘శ్రీరస్తు శుభమస్తు’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.

అయితే లావణ్య ఎంత బిజీగా గడుపుతున్నా.. ఓ యువహీరో ప్రేమ కోసం మాత్రం తన సమయాన్ని కేటాయిస్తుందట. ఆ యువహీరోకి ఇండస్ట్రీలో మంచి పలుకుబడితో పాటు ఆస్తి కూడా ఉంది. తన స్నేహం నచ్చడంతో ఆ యువహీరోతో ప్రేమలో పడిందట లావణ్య. ఆ హీరోకు కూడా లావణ్య అంటే లవ్వే.. అయితే ఈ విషయాన్ని ఎవరికి తెలియకుండా గోప్యంగా ఉంచాలనుకున్నారు కానీ బయటకు తెలిసిపోయింది. లావణ్య మాత్రం ఈ విషయాన్ని ఖండిస్తోంది. మరి ఈ ప్రేమ వ్యవహారం ఎక్కడ వరకు వెళ్తుందో.. చూడాలి!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus