అందం, అభినయంతో ఆకట్టుకుంటున్న అందాల తార లావణ్య త్రిపాఠి కులం గురించి ఒక ట్వీట్ చేయడంతో అది ఇప్పుడు వివాదాస్పదం అయింది. ట్వీట్ చేసిన కొద్దిసేపటికే ఆ ట్వీట్ ని డిలీట్ చేయడంతో ఇప్పుడు మరింత చర్చనీయాంశంగా మారింది.
ఇక విషయంలోకి వెళితే, లావణ్య త్రిపాఠి బ్రాహ్మణ కులానికి చెందినది. నేను కూడా ఒక బ్రాహ్మణ కులానికి చెందిన అమ్మాయినే, కొందరు బ్రాహ్మణులకు మేమే గొప్ప అనే భావన ఎందుకు ఉంటుందనేది నాకు అసలు అర్ధం కావట్లేదు. మనం చేసే పనుల వలన మనం గొప్ప వాళ్ళం అవుతాం అంతేకాని మన కులం వాళ్ళ గొప్పవాళ్ళం కాలేము అంటూ ట్వీట్ చేసింది. కానీ ట్వీట్ చేసిన కొద్దిసేపటికి ఆ ట్వీట్ డిలీట్ చేసింది. అయితే లోక్ సభ స్పీకర్ ఓం ప్రకాశ్ బిర్లా ఇటీవల జరిగిన అఖిల బ్రాహ్మణ మహాసభకు ముఖ్య అతిధిగా హాజరై పరశురాముడి తపస్సు, త్యాగం వలన బ్రాహ్మణులకు సమాజంలో ఉన్నత స్థానం ఉందని వాక్యాలు చేసారు. ఇక హీరోయిన్ లావణ్య త్రిపాఠి, లోక్ సభ స్పీకర్ బ్రాహ్మణ కులానికి అనుకూలంగా మాట్లాడినదానికే కౌంటర్ వేసిందని వివాదంలో చిక్కుకోవడం ఎందుకని వెంటనే మళ్ళీ ట్వీట్ డిలీట్ చేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి.