Leader: మన స్టార్‌ హీరోల్లా కలెక్షన్ల కామెడీ చేస్తున్న లెజెండ్‌ శరవణన్‌

Advertisement

తమిళనాట ఇటీవల ఓ సినిమా విడుదలైంది. ఆ సినిమా ఫలితం ఏంటి అని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ సినిమాకు అనూహ్యంగా మూడు రోజుల్లోనే రూ.25 కోట్లు వసూళ్లు సాధించింది. అదేంటి అంత పెద్ద సినిమా ఏమొచ్చింది.. సౌత్‌ సినిమాలను బాగా ఫాలో అయ్యేవారు కూడా ఇలాంటి సినిమా ఎప్పుడు వచ్చిందా అని అనుకుంటారు. అయితే సినిమా పేరు చెబితే ‘అవునా!’ అని అవాక్కవుతారు. అదే ‘లీడర్‌’. ఏంటి లెజెండర్‌ శరవణన్‌ ‘లీడర్‌’ సినిమానా అని ఆశ్చర్యపోతున్నారా? యస్‌.. ఆ సినిమా గురించే.

Leader

గత వారాంతంలో తమిళంతోపాటు తెలుగులో కూడా ఆ సినిమా విడుదలైంది. శర్వానంద్‌ ‘బైకర్’, నిహారిక కొణిదెల ప్రొడక్షన్‌లో రూపొందిన ‘రాకాస’ సినిమాల మధ్యలో ‘లీడర్‌’ తెలుగు వారికి పెద్దగా కనిపించింది లేదు. ఆ మాటకొస్తే తమిళనాట కూడా ఈ సినిమాను పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. అయితే శరవణన్‌ హవా కారణంగా కాస్త సోషల్‌ మీడియాలో హడావుడి కనిపించింది. అయితే థియేటర్లలో పెద్దగా జనాలు లేరు అని టాక్‌. కానీ ఇప్పుడు చూస్తే మూడు రోజుల్లోనే సినిమాకు రూ.25 కోట్లు వచ్చాయని పోస్టర్‌ రిలీజ్‌ చేశారు.

అంతేకాదు రూ.100 కోట్ల వసూళ్ల దారిలో తమ సినిమా ఉంది అని కూడా ఆ పోస్టర్‌ మీద రాసుకొచ్చారు. దీంతో శరవణన్‌కి ఎప్పుడూ అలవాటైనట్లుగానే మరోసారి ట్రోలింగ్‌ బారిన పడ్డాడు. ఏంటీ వసూళ్లు అంటూ ట్రోలింగ్‌ చేస్తున్నారు. పనిలో పనిగా మన తెలుగు ఫ్యాన్స్‌ కూడా కాస్త నోరు చేసుకుంటున్నారు. అయితే ఇక్కడ మరచిపోకూడని విషయం ఏంటంటే.. మరీ శరవణన్‌ అంత కాకపోయినా మన హీరోల సినిమాలకు అందులోనూ స్టార్‌ హీరోల సినిమాలకు ఇలాంటి వసూళ్ల పోస్టర్లు సహజం.

ఒక హీరో పేరు చెప్పడం, ఇంకో హీరో పేరు చెప్పకపోవడం కాదు కానీ.. అగ్ర హీరోల సినిమాలకు ఇలాంటి నకిలీ వసూళ్ల పోస్టర్లు వచ్చాయి. ఓ యువ నిర్మాత అయితే పోస్టర్ల వెనుక కథ గురించి చెప్పారు కూడా. కాబట్టి మన స్టార్‌ హీరోలు పోస్టర్ల కామెడీ ఇప్పుడు శరవణన్‌ చేశాడు.

ఏంటి అనిల్‌ రావిపూడి ‘రామాయణం’ తీస్తున్నారా? నిజమేనా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus