సినిమా కధ, కధనం, మ్యాటర్ రోజుకో మలుపు తిరుగుతుంది. అలనాటి సినిమాల్లో అసలు ఎక్స్‌పోసింగ్ అన్న పదమే ఉండేది కాదు. ఇంకా చెప్పాలి అంటే అందాల ఆరబోతకు ఒక ఐటమ్ సాంగ్ అనే దాన్ని జోడించి మరీ రసిక ప్రయులను ఆకర్శించేవారు. అప్పట్లో ఆ ఫార్మాట్ బాగా వర్క్ ఔట్ అయ్యింది. ఇక కాలానుగుణంగా ఎన్ని మార్పులు చోటు చేసుకున్న సినిమా పరిశ్రమలో హీరోయిన్స్ సైతం హాట్ గా నటించడం మొదలు పెట్టేయ్యడంతో మాస్ కు మంచి బేస్ దొరికినట్లు అయ్యింది. అందాల ఆరబోత మాట పక్కన పెడితే, బాలీవుడ్ కే పరిమితం అయిన “లిప్ లాక్”సీన్స్ ఈమధ్య మన సౌత్ ఇండియన్ మూవీస్ లో….అందులోనూ తెలుగు సినిమాల్లో బాగా ఎక్కువ అయ్యాయి అన్న టాక్ బలంగా వినిపిస్తుంది. హీరోయిన్స్ అవకాశం రావడమే ఆలస్యం దర్శక నిర్మాతలు ఎలా కోరుకుంటే అలా తమని తాము తమ అందాలతో దూసుకుపోతున్నారు.
కధానుగుణంగా చేస్తున్నాం, క్యారెక్టర్ డిమాండ్ చెయ్యడం వల్లనే చేస్తున్నాం అంటూ కాకమ్మ కబుర్లు చెబుతూనే, సినిమాల్లో హాట్ సీన్స్, లిప్ లాక్ డోస్ విపరీతంగా పెంచేస్తున్నారు. అసలే రోజుకో కొత్త అందం పరిశ్రమకు పరిచయం అవుతున్న వేళ తమని తాము ఇలా హాట్ ఇమేజ్ తో ఎంకరేజ్ చేసుకోవాలని కథానాయికలు సైతం వాటికి పచ్చ జెండా ఊపేస్తున్నారు. ఇక దర్శక నిర్మాతలు సైతం కధతో, సిచుయేషన్ లో పని లేకుండా, ప్రతి సినిమాలో అదిరిపోయే హాట్ సీన్స్, లిప్ లాక్ ప్లాన్ చేసి యూత్ ని అట్ర్యాక్ట్ చేసి సినిమాలు తీస్తున్నారు. ఇంతవరకూ బాగానే ఉంది కానీ, మనవాళ్ళు మరీ హాలీవుడ్ రేంజ్ కు పోయి, అన్నీ విప్పేసి చూపిస్తే చెప్పువదానికి కూడా సామాన్య ప్రేక్షకుడు సిగ్గు పడతాడు. ఏది ఏమైనా….సినిమా అంటే వ్యాపారం దాన్ని దృష్టిలో పెట్టుకుని సినిమాలు నిర్మించే వాళ్ళు ఉన్నంత వరకూ ఈ మార్పులు తప్పవు.