టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!

ఒకప్పుడు బాలీవుడ్ సినిమాల్లో నటిస్తే డబ్బుకి డబ్బు, క్రేజ్ కు క్రేజ్.. వస్తుంది అని నటీనటులు భావించే వాళ్ళు. ఇండియా వైడ్ అత్యధిక మార్కెట్ కలిగిన ఇండస్ట్రీగా ఒకప్పుడు బాలీవుడ్ ఉండేది. ఆ తర్వాత రెండో స్థానంలో తమిళ సినీ పరిశ్రమ ఎక్కువ మార్కెట్ కలిగిన ఇండస్ట్రీగా చలామణి అవుతూ వచ్చింది. బాలీవుడ్లో కాకపోతే కోలీవుడ్ అన్నట్టు నటీనటులు.. అవకాశాల కోసం పరితపించేవాళ్ళు. కానీ ఇప్పుడు టాలీవుడ్ మార్కెట్ ఎవ్వరూ ఊహించని విధంగా పెరిగింది.

ఇక్కడ వరుసగా పాన్ ఇండియా సినిమాలు రూపొందుతున్నాయి. తెలుగు సినిమాల్లో నటిస్తే చాలు దేశమంతా పాపులర్ అయిపోవచ్చు అనే నమ్మకం నటీనటులకు కలిగింది.ఇక్కడి నిర్మాతలు కూడా డేర్ గా పాన్ ఇండియా సినిమాలు చేయడానికి ముందుకు వస్తున్నారు. ఓ రకంగా తెలుగు సినిమాలు హిందీ సినిమాలను కూడా డామినేట్ చేసేస్తున్నాయి అనడంలో అతిశయోక్తి లేదు.

అందుకే ఒకప్పుడు టాలీవుడ్ సినిమాల్లో నటించిన హీరోయిన్లు.. టాలీవుడ్ ను వదిలేసిన హీరోయిన్లు, ఇప్పుడు టాలీవుడ్ సినిమాల్లో అవకాశాల కోసం పరితపించి పోతున్నారు. ఛాన్స్ దొరికితే రీ ఎంట్రీ ఇచ్చేద్దాం అని మేనేజర్లతో టాలీవుడ్ దర్శక నిర్మాతలను సంప్రదిస్తున్నారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 10 మంది హీరోయిన్లు ఇప్పుడు టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీగా ఉన్నారు. వాళ్ళు ఎవరో ఓ లుక్కేద్దాం రండి :

1) భావన :

మలయాళం బ్యూటీ భావన.. గోపీచంద్ హీరోగా నటించిన ‘ఒంటరి’ చిత్రంతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత హీరో, మహాత్మ, నిప్పు(గెస్ట్ రోల్) వంటి సినిమాల్లో నటించింది. కానీ ఇందులో ఏ సినిమా సక్సెస్ కాలేదు. దీంతో టాలీవుడ్ కు దూరమైన ఈ బ్యూటీ ఇప్పుడు మళ్ళీ.. ఇక్కడ రీ ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది.

2) స్వాతి :

కలర్స్ స్వాతి గా పాపులర్ అయిన ఈమె ‘అష్టా చమ్మా’ ‘స్వామి రారా’ ‘కార్తికేయ’ వంటి హిట్ సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. కానీ పెళ్ళైన తర్వాత ఈమె సినిమాలకు దూరంగా ఉంటూ వస్తోంది. త్వరలోనే ఈమె మళ్ళీ టాలీవుడ్ కు రీ ఎంట్రీ ఇవ్వబోతోంది అని తెలుస్తుంది.

3) జెనీలియా :

‘బాయ్స్’ ‘సత్యం’ ‘సై’ ‘బొమ్మరిల్లు’ ‘ఢీ’ ‘రెడీ’ వంటి హిట్ సినిమాల్లో నటించిన ఈమె పెళ్ళైన తర్వాత టాలీవుడ్ కు దూరమైంది. చాలా కాలం తర్వాత ఈమె మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి కొడుకు డెబ్యూ మూవీతో రీ ఎంట్రీ ఇస్తుందని తెలుస్తుంది. ఈ మూవీలో ఆమె సాఫ్ట్ వేర్ కంపెనీ సీఈవో గా కనిపించనుంది అని వినికిడి.

4) నిఖిత :

Actress Nikitha,Actress Nikitha New Stills,Actress Nikitha Photoshoot

ఇవివి సత్యనారాయణ గారి తనయుడు ఆర్యన్ రాజేష్ హీరోగా నటించిన ‘హాయ్’ చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ తర్వాత ‘కళ్యాణ రాముడు’ ‘ఖుషి ఖుషీగా’ ‘డాన్’ ‘అనసూయ’ వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించింది. ఇప్పుడు టాలీవుడ్ కు రీ ఎంట్రీ ఇవ్వడానికి చాలా సిన్సియర్ గా ప్రయత్నిస్తుంది.

5) ఇషా చావ్లా :

16isha-chawla

‘ప్రేమ కావాలి’ ‘పూల రంగడు’ వంటి హిట్ సినిమాల్లో నటించిన ఈ అమ్మడు త్వరలోనే రీ ఎంట్రీ ఇవ్వబోతుంది అని ఇండస్ట్రీ టాక్.

6) లయ :

‘స్వయంవరం’ ‘ప్రేమించు’ ‘మనోహరం’ ‘హనుమాన్ జంక్షన్’ ‘మనసున్న మారాజు’ ‘శివరామరాజు’ ‘టాటా బిర్లా మధ్యలో లైలా’ వంటి హిట్ సినిమాల్లో నటించిన ఈమె ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ చిత్రంలో గెస్ట్ రోల్ చేసింది కానీ.. ఇప్పుడు ఫుల్ లెంగ్త్ రోల్ తో రీ ఎంట్రీ ఇవ్వాలని చూస్తుంది.

7) మీరా జాస్మిన్ :

‘అమ్మాయి బాగుంది’ ‘భద్ర’ ‘యమగోల మళ్ళీ మొదలైంది’ వంటి హిట్ చిత్రాల్లో నటించిన మీరా జాస్మిన్.. ఇప్పుడు టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వాలని చూస్తుంది. అందుకోసం స్కిన్ షో చేయడానికి కూడా రెడీ అయిపోయింది.

8) సదాఫ్ :

‘జయం’ ‘లీలా మహల్ సెంటర్’ ‘అపరిచితుడు’ వంటి హిట్ సినిమాల్లో నటించిన సదాఫ్ ప్రస్తుతం బుల్లితెర పై రాణిస్తుంది. కానీ ఛాన్స్ దొరికితే తెలుగు సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలని బాగా ట్రై చేస్తుంది.

9) అన్షు :

‘మన్మథుడు’ బ్యూటీ అన్షు.. మొన్నామధ్య ఎన్టీఆర్- త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కబోయే మూవీతో రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయినట్టు ప్రచారం జరిగింది. కానీ ఆ ప్రాజెక్టు హోల్డ్ లో పడింది. అయినా ఆమె రీ ఎంట్రీ ఇవ్వడానికి తన వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉంది.

10) సోనాలీ బింద్రే :

‘మురారి’ ‘ఇంద్ర’ ‘ఖడ్గం’ ‘మన్మథుడు’ ‘శంకర్ దాదా ఎం బి బి ఎస్’ వంటి హిట్ చిత్రాల్లో నటించిన ఈ అమ్మడు పెళ్ళైన తర్వాత సినిమాలకు దూరమైంది. అయితే మొన్నామధ్య ఈమె క్యాన్సర్ తో ఫైట్ చేసి మరీ గెలిచింది. ఇప్పుడు మళ్ళీ తెలుగు సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలని ట్రై చేస్తుంది.

Share.