యువ దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న సాహో సినిమా షూటింగ్ ఊపందుకుంది. రామోజీ ఫిలిం సిటీలో వేసిన 5 కోట్ల భారీ సెట్ లో నిన్న భారీ షెడ్యూల్ వేగంగా సాగుతోంది. యువీ క్రియేషన్స్ బ్యానర్లో వంశీ, ప్రమోద్ లు 200 కోట్ల బడ్జెట్ తో ఏకకాలంలో మూడు భాషల్లో నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ తారలు నటించడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. సినిమాకి ఉత్తరాదిన క్రేజ్ రావాలని డైరక్టర్ వారిని తీసుకుంటున్నారు. ముందుగా నీల్ నితిన్ ముకేష్ ని తీసుకున్న చిత్ర బృందం తర్వాత చుంకే పాండే, జాకీష్రాఫ్ లను విలన్ రోల్స్ కోసం సెలక్ట్ చేశారు. అలాగే హీరోయిన్ గా నటిస్తున్న బ్యూటీ కూడా బాలీవుడ్ భామే.
శ్రద్ధ కపూర్, ప్రభాస్ కి జోడీగా నటిస్తోంది. వీరు మాత్రమే కాకుండా తాజాగా అందిన సమాచారం ప్రకారం.. మహేష్ మంజ్రేకర్, మందిర బేడీ, టిన్ను ఆనంద్ లు నటించనున్నట్లు తెలిసింది. మందిర కల్కి అనే నెగిటివ్ పాత్ర పోషిస్తున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. బాలీవుడ్ లోనే కాకుండా తమిళంలోనూ ఈ సినిమా సక్సస్ సాధించాలని కోలీవుడ్ నటుడు అరుణ్ విజయ్ ను ఓ కీలక రోల్ కోసం ఎంపిక చేశారు. భారీ స్టార్ కాస్టింగ్ కలిగి ఉన్న ఈ మూవీ వచ్చే ఏడాది రిలీజ్ కానుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.