50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!

ప్రస్తుతం అమ్మాయిలైనా..అబ్బాయిలైనా 30 ఏళ్ళ వయసు వస్తేనే కానీ పెళ్లిళ్లు చేసుకోవడం లేదు. సరైన విధంగా సెటిలైతేనే కానీ పెళ్లి చేసుకోకూడదు అని చాలా మంది ఫిక్సయిపోతున్నారు. ఇదిలా ఉండగా.. అమ్మాయిలకు 20 ఏళ్ళ వయసు వచ్చిందంటేనే పెళ్లి చేసి పంపించెయ్యాలని ఇంట్లో ఉన్న పెద్దోళ్ళు ఆశపడుతుంటారు. అయితే కొంతమంది అమ్మాయిలు చదువు, ఉద్యోగం పేరు చెప్పి 30 ఏళ్ళ వరకూ పెళ్లిని స్కిప్ చేసేస్తున్నారులెండి.

అయినప్పటికీ 30కి మించనివ్వరు అనేది వాస్తవం. అయితే హీరోయిన్ల పరిస్థితి సాధారణ అమ్మాయిలలా ఉండదు. వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు అంటేనే ఫేడౌట్ అయిపోయారు అని అంతా ఫిక్సయిపోతుంటారు.అయితే ఎంతకాదనుకున్నా వాళ్ళు కూడా 40 ఏళ్ళ లోపే పెళ్లిళ్లు చేసేసుకోవడానికి ట్రై చేస్తుంటారు. అయితే కొంతమంది హీరోయిన్లు మాత్రం 50 ఏళ్ల వయసుకు దగ్గరపడుతున్నా ఇంకా పెళ్లి గురించి ఆలోచించడం లేదు. వాళ్ళు ఎవరో ఓ లుక్కేద్దాం రండి :

1) వెన్నిరాడై నిర్మల :

‘శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్’ చిత్రంలో చిరంజీవి తల్లిగా నటించింది ఈమె. గతంలో ఇంకా ఎన్నో చిత్రాల్లో హీరోయిన్ గా కూడా నటించింది.ఈమె వయసు 72 ఏళ్ళు.ఈమె కొన్ని కారణాల వల్ల పెళ్లి చేసుకోలేదట.

2) నర్గీస్ ఫక్రీ :

ఈమె వయసు 40 ఏళ్ళు. ఎక్కువగా హిందీ సినిమాల్లోనే నటించింది. 40 ఏళ్ళ వయసొచ్చినా ఈమె ఇంకా పెళ్లి చేసుకోలేదు.

3) శోభన :

అప్పట్లో చిరు, బాలయ్య, నాగార్జున వంటి హీరోలతో కలిసి నటించిన ఈ బ్యూటీ.. 50 ఏళ్ల వయసొచ్చినా పెళ్లి చేసుకోలేదు.

4) సుష్మితా సేన్ :

44 ఏళ్ళ వయసొచ్చినా ఈమె పెళ్లి చేసుకోలేదు.కానీ రొమన్ షాల్ అనే వ్యక్తితో గత రెండేళ్లుగా సహజీవనం చేస్తుందట.

5) సితార :

హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ నటి.. తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా స్థిరపడింది. 47ఏళ్ళ వయసొచ్చినా ఇప్పటికీ ఈమె పెళ్లి చేసుకోలేదు.

6) అమీషా పటేల్ :

తెలుగులో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, బాలకృష్ణ వంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించిన ఈమె కూడా 44ఏళ్ళ వయసొచ్చినా పెళ్లి చేసుకోలేదు.

7) నగ్మా :

తెలుగుతో పాటు తమిళంలో కూడా స్టార్ హీరోయిన్ గా రాణించింది. ఈమె వయసు కూడా 45 ఏళ్ళు. అయినా ఈమె ఇంకా పెళ్లి చేసుకోలేదు.

8) టబు :

ఈమె కూడా టాలీవుడ్ స్టార్ హీరోయినే..! 48 ఏళ్ళ వయసొచ్చినా కూడా.. ఈమె పెళ్లి గురించి ఆలోచించడం లేదు.

9) ఆశ పారేఖ్ :

చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను మొదలుపెట్టి తరువాత ఎన్నో హిందీ సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. ఈమె వయసు 78 ఏళ్ళు. ఎందుకో ఈమె పెళ్లి చేసుకోలేదు.

10) కౌసల్య :

‘అల్లుడుగారు వచ్చారు’ ‘పంచదార చిలక’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనా ఈ నటి ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తుంది. 40 ఏళ్ల వయసొచ్చినా ఇంకా ఈమె పెళ్లి చేసుకోలేదు.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus