Avaneendra: ‘లవ్ మౌళి’ దర్శకుడి షాకింగ్ కామెంట్స్.. అది వైల్డ్ థాట్ కాదంటూ..!

  • June 10, 2024 / 03:00 PM IST

నవదీప్ (Navdeep) హీరోగా ‘లవ్ మౌళి’ (Love Mouli) అనే సినిమా వచ్చింది. ‘టీజర్, ట్రైలర్ చాలా అంటే చాలా బోల్డ్ గా ఉన్నాయి’ అని చెప్పి జనాలు షాక్ కి గురయ్యారు. సినిమా విడుదలకు కూడా చాలా కష్టాలు ఎదురయ్యాయి. సెన్సార్ వారు ఈ సినిమాలో చాలా సన్నివేశాలకి అభ్యన్తరాలు తెలిపారు. యు/ఎ కావాలంటే చాలా కట్లు కూడా చెప్పారట. అవి కట్ చేయడం ఇష్టం లేక ‘ఎ’ సర్టిఫికెట్ తోనే సినిమాని విడుదల చేశారు.

సినిమా చూసిన వాళ్లలో చాలా మంది కొన్ని సన్నివేశాలకి షాక్ అయ్యారు. ముఖ్యంగా ఓ సన్నివేశంలో హీరో అమ్మాయి ‘బ్రా’ని మందు వడగట్టుకోవడానికి వాడతాడు. ఆ సీన్ చాలా డిస్టర్బ్డ్ గా అనిపించింది అని వారు చెప్పుకొచ్చారు. అదే సీన్ టీజర్లో కూడా ఉంటుంది. ప్రమోషన్స్ లో ఇదే విషయం పై దర్శకుడు అవనీంద్రని (Avaneendra) ప్రశ్నిస్తే… “కొన్ని కమర్షియల్ సినిమాల్లో హీరో కత్తి పట్టుకుని 20 మందిని నరికేస్తాడు.

అది డిస్టర్బ్డ్ గా, వైల్డ్ గా అనిపించదు. కానీ హీరో మందు తాగడానికి బ్రా సాయం తీసుకుంటే వైల్డ్ గా అనిపిస్తుందా? నిజమే సమాజంలో చాలా మంది స్త్రీలు తన ఇన్నర్స్ ని బయట ఆరేసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎవరైనా మగాళ్లు ఉంటారేమో అని.! కానీ నా సినిమాలో హీరోకి ఆ సెన్స్ ఉండదు. వాడికి అమ్మాయిల కంఫర్ట్ ఏంటో తెలీదు. అందుకే అలా ప్రవర్తిస్తాడు” అంటూ చెప్పుకొచ్చాడు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus