Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

నెట్‌ఫ్లిక్స్ లో అత్యంత ప్రజాదరణ పొందిన ఆంథాలజీ సిరీస్ గా ‘లస్ట్ స్టోరీస్’ నిలిచింది. ఇప్పటికే 2 సీజన్లు వచ్చాయి. మొదటి సీజన్ కి నెగిటివ్ రెస్పాన్స్ వచ్చినా.. ఎక్కువ మంది చూశారు. 2వ సీజన్ కి మొదటి సీజన్ ను మించి నెగిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అయినప్పటికీ మృణాల్ ఠాకూర్, తమన్నా..ల బెడ్ రూమ్ సీన్స్ వల్ల.. మొదటి సీజన్ ను మించి వ్యూయర్షిప్ నమోదయ్యింది. అలా అది కూడా పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

Lust Stories 3

ఇప్పుడు ‘లస్ట్ స్టోరీస్ 3′(Lust Stories 3) కూడా రాబోతోంది. సెప్టెంబర్ 18 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. మొన్నామధ్య వదిలిన గ్లింప్స్ పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. తాజాగా ట్రైలర్ వదిలారు. 2 నిమిషాల 19 సెకన్ల నిడివి కలిగిన ట్రైలర్ ఇది. ఈ సీజన్లో కూడా 4 జంటల కథలు చెప్పబోతున్నారు. అందులో రియల్ లైఫ్ కపుల్ అయినటువంటి సిద్దార్థ్- అదితి రావ్ హైదరి కథ కూడా ఒకటి. దాని వల్లే తెలుగు ప్రేక్షకులకి కూడా ‘లస్ట్ స్టోరీస్ 4’ పై స్పెషల్ ఫోకస్ పడిందని చెప్పాలి.

ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. ఇందులో ‘మహిళలు స్విచ్ వేయగానే వెలగడానికి, ఆపగానే ఆరిపోవడానికి వాళ్ళు లైట్ బల్బులు కాదు, కొవ్వొత్తులు లాంటి వాళ్ళు… మండిపోరు,  మెల్లగా కరుగుతారు’ అనే డైలాగ్ ఉంటుంది. దీంతో స్త్రీల భావోద్వేగాల గురించి, వారి సున్నితత్వం గురించి చాలా చక్కగా చెప్పారు. అలాగే ‘బూతు అనేది భాషలో ఉండదు, అది రాసేవారి ఉద్దేశ్యం మరియు సృజనాత్మకతలో ఉంటుంది’ ‘రిలేషన్ షిప్స్ లో రిటర్న్స్ కావాలంటే ముందు ఇన్వెస్ట్ చేయాలి’ వంటి డైలాగులు కథలోని డెప్త్ ను తెలియజేస్తున్నాయి.

మొత్తంగా ‘లస్ట్ స్టోరీస్ 3’ వెబ్ సిరీస్ ట్రైలర్లో లస్ట్ కంటే ఫిలాసఫీనే ఎక్కువగా కనిపిస్తుంది. లవ్ లైఫ్ లో ఉండే భావోద్వేగాలు, సెన్సిబిలిటీస్ వంటి వాటిని ప్రధానంగా తీసుకుని ఈ సిరీస్ ని రూపొందించినట్టు ఉన్నారు. మీరు కూడా ఓ లుక్కేయండి :

‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus