మా ఎలక్షన్స్ లో ఊహించని విజయాన్ని అందుకున్న నరేష్

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకంటే ఒకింత రసపట్టుగా సాగిన నిన్న మా అసోసియేషన్ ఎలక్షన్స్ లో ఫార్మర్ ప్రెసిడెంట్ ను నరేష్ ఓడించడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఫండ్ రైజింగ్ ఈవెంట్స్ లో శివాజీరాజా పెద్ద మొత్తంలో మా అసోసియేషన్ ను మోసం చేశాడని నరేష్ పెద్ద రచ్చ చేసిన విషయం తెలిసిందే. కానీ.. శ్రీకాంత్ తో కలిసి తాను నిజాయితీపరుడనని శివాజీరాజా కౌంటర్ ఇచ్చినప్పటికీ అది పెద్దగా వర్కవుట్ అవ్వలేదని ఈ ఎలక్షన్స్ రిజల్ట్స్ తో తేలిపోయింది.

ఇక మహేష్ బాబు, నాగబాబు, నాగార్జునల సపోర్ట్ తో గెలిచిన నరేష్ ఇంకెప్పుడూ ఎలక్షన్స్ లో తాను పోటీ చేయనని, ఎలక్షన్స్ జరిగిన విధానం తనకు నచ్చలేదని, ఓట్ల కోసం శివాజీ రాజా డబ్బులు పంచడం చాలా బాధించిందని నరేష్ పేర్కొన్నారు. నిన్న అర్ధరాత్రి సినిమా ఫక్కీలో ఎనౌన్స్ అయిన ఈ రిజల్ట్స్ లో అందరూ శివాజీరాజా గెలుస్తాడని ఊహించిన టైమ్ లో ఎవ్వరూ ఎక్స్ పెక్ట్ చేయని విధంగా నరేష్ గెలిచి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. మరి నరేష్ ప్యానల్ బాధ్యతలు స్వీకరించినతర్వాత మా అసోసియేషన్ పనితీరులో ఎలాంటి మార్పులు వస్తాయి అనేది చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus